37.2 C
Hyderabad
March 28, 2024 20: 34 PM
Slider ముఖ్యంశాలు

సైబరు నేరాల నియంత్రణకు సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్. సహకారంతో ప్రత్యేక శిక్షణ

#cybercrime

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న సైబరు నేరాల నియంత్రణ, దర్యాప్తుకు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబరు ఇంటిలిజెన్సు అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ సహకారంతో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో రాష్ట్ర పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచే రెండు రోజుల పాటు అంటే 17, 18 తేదీల్లో నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

ఈ శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక హాజరుకాగా, రాష్ట్ర డీజీపీ  గౌతం సవాంగ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుండి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ  గౌతం సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెరుగుతున్న సైబరు నేరాలను కట్టడి చేయడానికి, నమోదైన సైబరు నేరాల్లో దర్యాప్తును వేగవంతం చేసేందుకు రాష్ట్రంలో అన్ని జిల్లాలు, కమీషనరేట్ పరిధిలో పని చేసే దర్యాప్తు అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ఇందులో భాగంగా ఢిల్లీలోని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబరు ఇంటిలిజెన్సు అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ అనే సంస్థ సహకారంతో శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం సిటీ, విశాఖపట్నం రూరల్, తూర్పు గోదావరి, రాజమండ్రి అర్బన్ కు చెందిన 100మందిని సైబరు నిపుణులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు.

అవకాశాన్ని శిక్షణకు హాజరయ్యే ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సైబరు నేరాల నియంత్రణ, దర్యాప్తుకు ఉపయోగపడే మెళుకువులను శ్రద్ధగా నేర్చుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లును ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటని, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ తో ఆర్ధిక నేరాలు, బాలికలు, మహిళలపై వేధింపులు, ప్రభుత్వ పథకాలతోను, ఆధార్ పేరు తోను, కరోనా వేక్సిన్ పేరుతో మోసాలు జరుగుతున్నాయన్నారు. వీటిని నిరోధించేందుకు దర్యాప్తు అధికారులు సైబరు భాగంలో తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

త్వరలో అత్యాధునిక సైబరు ల్యాబ్ లను ఏర్పాటు చేస్తామని, సైబరు నేరాలను వేగంగా దర్యాప్తు చేసేందుకు సైబర్ టూల్స్ ను ప్రతీ జిల్లాకు అందుబాటులో తీసుకొని వచ్చి, సైబరు నేరాలకు పాల్పడే వారిపై సైబరు బుల్లీ షీటులను తెరిచి, నిఘా ఏర్పాటు చేసి, ఈ తరహా నేరాలను కట్టడి చేస్తామని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు.

టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ జి.పాలరాజు  మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ చొరవతో దర్యాప్తు అధికారుల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. శిక్షణ ఆవశ్యకతను ప్రతీ ఒక్కరూ గుర్తించి, సైబరు నేరాలను నియంత్రించేందుకు, దర్యాప్తు చేసేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని నిపుణులను అడిగి తెలుసుకోవాలని శిక్షణకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు.

సీఆర్ సీఐడీఎఫ్ ప్రతినిధి ప్రసాద్ పాటిబండ్ల మాట్లాడుతూ ఇటీవల నమోదవుతున్న సైబర్ నేరాల్లో దర్యాప్తు అధికారులు ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు. వివిధ సైబరు నేరాల్లో దర్యాప్తును చేపట్టే విధానం గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నామని, శిక్షణ సైబరు కేసుల దర్యాప్తుకు ఎంతగానో ఉపయోగపడు తుందన్నారు.

శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం. దీపిక, వైస్ ప్రిన్సిపాల్ వెంకట అప్పారావు, పీటీసీ అదనపు ఎస్పీ హస్మాన్ ఫర్హిన్, డీఎస్పీలు సిహెచ్.వి.రమేష్, వివి అప్పారావు, సిఐలు జి.రామకృష్ణ, వేణుగోపాలరావు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ సిటీ, రూరల్, తూర్పు గోదావరి, రాజమండ్రి అర్బన్ కు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

Satyam NEWS

KCR అనుచిత వ్యాఖ్యలకు రగులుకుంటున్న కార్చిచ్చు

Satyam NEWS

రేవంత్ రెడ్డిని అడ్డుకోవడం మంచిపని కాదు

Satyam NEWS

Leave a Comment