30.2 C
Hyderabad
September 14, 2024 16: 12 PM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

చెన్నై – సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

train

వారానికి రెండుసార్లు చెన్నై – సికింద్రాబాద్‌ – చెన్నై ప్రత్యేక రైళ్లని నడిపేందుకు రైల్వేబోర్డు అనుమతించింది. ఇప్పటి వరకు ఈ మార్గంలో నిత్యం రాత్రి వేళ నడిచే చెన్నై ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ఉండగా ఎప్పటినుంచో ప్రయాణికుల నుంచి వస్తోన్న డిమాండ్‌ మేరకు మరో రైలుని బోర్డు పట్టాలెక్కించింది. తొలుత ప్రత్యేక రైలుగా నడిపి ప్రయాణికుల నుంచి లభించే ఆదరణని బట్టి రెగ్యులర్‌ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా డిసెంబరు నెలాఖరు వరకు ప్రతీ శుక్ర, ఆదివారాలలో నెం బరు 06059 చెన్నై సెంట్రల్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు రాత్రి 7.30 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 1.48కి తెనాలి, 2.35కి గుంటూరు, 3.38కి పిడుగు రాళ్ల, 4.48కి మిర్యాలగూడ, వేకువజామున 5.33కి నల్గొండ, మరుసటి రోజు ఉదయం 8.25కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. నెంబరు 06060 సికింద్రాబాద్‌ – చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు ప్రతి సోమ, శనివారంలలో రాత్రి 8 గంటలకు బయలుదేరి 10.13కి నల్గొండ, 11 గంటలకు మిర్యాలగూడ, అర్ధరాత్రి 12.18కి పిడుగురాళ్ల, 1.30కి గుంటూరు, 2.18కి తెనాలి, మరుసటి రోజు ఉదయం 10 గం టలకు చెన్నై సెంట్రల్‌ చేరుకునేలా సమయ పట్టికని రూపొందించారు.

Related posts

జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్

Bhavani

ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్

Satyam NEWS

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ

Satyam NEWS

Leave a Comment