28.7 C
Hyderabad
April 20, 2024 06: 26 AM
Slider

క్రిస్మస్ కు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి తెలుసా?

#SantaClaus

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు జరుపుకునే పండుగ అయిన క్రిస్మ‌స్ కు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. క్రిస్మస్ వేడుకలలో ప్రధానంగా కనిపించే ఆకర్షణ క్రిస్మ‌స్ తాత‌. ఈ తాత అంటే పిల్లలకు ఎంతో ఇష్టం.

తాము కళ్లు మూసుకుని ఏదైనా కోరుకుంటే దాన్ని తమ చేతికి అందిస్తాడని పిల్లల నమ్మకం. అలా క్రిస్మస్ తాతగా పేరు పొందిన శాంతాక్లాజ్ ద‌క్షిణ ద్రువంలో ఉంటాడు. క్రిస్మ‌స్ తాత తెచ్చే కానుక‌ల కోసం ఏకంగా 70 కోట్ల మంది పిల్ల‌లు ఎదురు చూస్తార‌ట‌!

మొద‌ట్లో క్రిస్మ‌స్ చెట్టును ప‌ర్వ‌దినాన వాడేవారు.. ఒక‌నొక ద‌శ‌లో చెట్లు త‌గ్గిపోవ‌డంతో బాతుఈక‌ల‌తో క్రిస్మ‌స్ చెట్ల‌ను చేయ‌డం, అనంత‌రం ప్లాస్టిక్‌, పేప‌ర్ ఇలా అనేక ర‌కాలుగా త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టారు.

రాత్రిపెట్టిన క్రిస్మ‌స్ చెట్టుమీద తెల్లారేస‌రికి సాలెగూడు పెడితే అదృష్టంగా భావిస్తారు. ఇంకా కొంద‌రైతే క్రిస్మ‌స్ చెట్టుతోపాటు ప్ర‌త్యేకంగా రూపొందించిన సాలెగూడు మాదిరి గూడును ఏర్పాటు కూడా చేస్తారు!

క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినాన చిన్న పిల్లలు జంతువుల మాట‌ల‌ను అర్థం చేసుకుంటార‌నే విశ్వాసం కొన్ని దేశాల్లో ఉంది.

క్రైస్తవులకు పవిత్ర పుణ్యక్షేత్రాలయిన బెత్లహెమ్, జెరూసలెంలోని రెండు పురాతన చర్చ్ ల ప్రధాన ద్వారాల తాళం చెవులు శతాబ్దాలుగా రెండు ముస్లిం కుటుంబాల చేతిలో ఉన్నాయి.

ప్రతి ఉదయమూ చర్చ్ తాళం తీయడం, సాయంత్రం తాళం వేయడం ఈ కుటుంబాల కర్తవ్యం. ఈ రెండు చర్చ్ ల ఆధ్యాత్మిక సేవలను వంతుల వారీగా వివిధ క్రైస్తవ మత శాఖల  వారు నిర్వహిస్తుంటారు.

మానవాళి అనుసరిస్తున్న మూడు మహోన్నత మతాలు- జుడా యిజం, క్రైస్తవం, ఇస్లాం ప్రభవించిన పవిత్ర గడ్డ మధ్య ప్రాచ్యం.

అపార ‘ద్రవ బంగారం’ నిక్షేపాలు ప్రసాదిస్తున్న భాగ్యరాశులతో తులతూగుతున్న ఈ ప్రాంత దేశాలు వర్తమాన యుగంలో ఉద్రిక్తతలు, యుద్ధాలకు నిరంతర ఉనికిపట్టు కావడం ఒక చారిత్రక విషాదం.

Related posts

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు

Sub Editor

8 ఏళ్లలోనే ప్రజల జీవన శైలిలో మార్పు

Murali Krishna

గుర‌జాడ విశ్వ‌విద్యాల‌య స్థాప‌న‌: విద్య‌, ఉద్యోగావకాశాలకు మేలిమ‌లుపు

Satyam NEWS

Leave a Comment