27.7 C
Hyderabad
April 24, 2024 10: 55 AM
Slider ముఖ్యంశాలు

మిర్చి పంటల్లో చీడపీడల వ్యాప్తి ఎదుర్కోవడానికి వ్యూహాలు

chilli

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లో మిర్చి పంటలో థ్రిప్స్ వ్యాప్తిని అరికట్టే వ్యూహాలను రూపొందించడానికి శాస్త్రవేత్తలు, మిర్చి పంట నిపుణులతో స్పైసెస్ బోర్డ్ ఆఫ్ సెంటర్ సమావేశం నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మిర్చి పంటలపై తీవ్రమైన థ్రిప్స్ దాడి పంట దిగుబడిని తీవ్రంగా ప్రభావితం చేయడం తో  మిర్చి రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. పంట నష్టంజరిగి , తమ ఆర్థిక భారాన్ని పెంచుతుందని భయపడుతున్నారు.

దాడి చేస్తున్న థ్రిప్స్ జాతుల వల్ల మిర్చి పంటకు వాటిల్లే ముప్పు ను పరిష్కరించడానికి మార్గాలను రూపొందించడానికి, మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, ఎం. పి.  జి.వి.ఎల్. నరసింహారావు శాస్త్రవేత్తలు, మిర్చి పంట నిపుణులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఐసిఎఆర్- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ (ఐఐహెచ్ ఆర్), డాక్టర్ వైఎస్ఆర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఐసిఎఆర్- నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్ సెక్ట్ రిసోర్సెస్ (ఎన్ బిఎఐఆర్), ఇండియన్ కార్దమం రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసిఆర్ ఐ), స్పైసెస్ బోర్డు; డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ అండ్ స్టోరేజీ (డిపిపిక్యూఎస్), న్యూఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ ,మిర్చి సీడ్ సప్లయర్ల ప్రతినిధులు హాజరయ్యారు.

జివిఎల్ నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ ను గత నెల ఆయన నాయకత్వంలో సంస్థ, ఉద్యానవన విభాగానికి చెందిన శాస్త్రవేత్తల బృందాలు క్షేత్ర స్థాయి వాస్తవికతను విశ్లేషించడానికి చీడలు సోకిన మిర్చి పొలాలలో జరిపిన సందర్శనకు తదుపరి చర్యగా నిర్వహించారు. స్పైసెస్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ ఎ.బి. రెమా శ్రీ రావు , నిపుణులకు స్వాగతం పలికారు. ఐఐహెచ్ ఆర్, ఎన్ బిఎఐఆర్, స్పైసెస్ బోర్డ్, స్టేట్ అగ్రి/హార్టకల్చరల్ డిపార్ట్ మెంట్ , ఇతర భాగస్వాముల నిపుణుల బృందం నిర్వహించిన క్షేత్ర సందర్శన సమయంలో నెలకొన్న పరిస్థితి తీవ్రతను వివరించారు.

రావు నేతృత్వంలోని క్షేత్ర సందర్శనలు, చీడల దాడి మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి , వారి పంటను రక్షించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి రైతులను సన్నద్ధం చేయడానికి వ్యూహాలు/కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తల బృందాలకు వీలు కల్పించింది.

సమగ్రమైన స్పష్టమైన విధానం అవసరం

నేటి సమావేశంలో పంట నిపుణులు శాస్త్రవేత్తలు పరిస్థితిని సమగ్రంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో, ఈ బెడద ఉన్న చోట మిర్చి పంట పై త్రిప్స్ పార్విస్పినస్ దాడి ని  అరికట్టేందుకు ఒప్పందం కుదుర్చుకోవడానికి సరి అయిన, స్పష్టమైన , సమ్మిళిత మైన విధానం అవసరమని నరసింహరావు సూచించారు.

ఉత్తమ వ్యవసాయ విధానాలపై రైతులకు సలహాలు ఇచ్చే వ్యవస్థ ను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని, బ్లూ స్టికీ ట్రాప్, స్వల్పకాల మిర్చి రకాల సాగు వంటి తక్కువ ధర/ సరసమైన పదార్థాలను సిఫారసు చేయాలని, తద్వారా రైతులు చీడలకు వ్యతిరేకంగా దృఢమైన వ్యూహాన్ని సంబంధిత విభాగాలు, సంస్థలు సంయుక్తంగా తయారు చేసే వరకు పరిస్థితిని ఎదుర్కొని, పంట కాపాడుకోగలరని ఆయన అన్నారు.

ఈ లోగా, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లోని ప్రభావిత క్షేత్రాల నుండి థ్రిప్స్ దాడి తట్టుకునే  మిర్చి రకాల  అభివృద్ధి , విశ్లేషణ, స్క్రీన్ పై ప్రధానంగా దృష్టి పెట్టాలని జివిఎల్ నరసింహారావు ఐసిఎఆర్-ఐహెచ్ ఆర్ ను అభ్యర్థించారు; ఇప్పటికే థ్రిప్స్ కు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉన్న అణువులను స్క్రీనింగ్ చేయాలని, ఐసిఎఆర్-ఎన్ బిఎఐఆర్ వంటి ఇతర సంస్థల సహాయంతో థ్రిప్స్ సహజ శత్రువులను గుర్తించాలని ఆయన ఐఐహెచ్ ఆర్ కీటక శాస్త్రవేత్తలను కోరారు.

విచక్షణారహితంగా క్రిమిసంహారక మందులు వద్దు

క్రిమిసంహారక మందుల విచక్షణారహిత వినియోగం, నత్రజని ఎరువులను అధికంగా ఉపయోగించడం, అక్టోబర్-నవంబర్ వర్షాలు, తరువాత వేడి ఇంకా తేమ పరిస్థితులు థ్రిప్స్ ను ప్రేరేపించినట్టూ,  సాధారణ మిరపకాయలను స్కిర్టోథ్రిప్స్ దోర్సాలిస్‌తో భర్తీ చేయడం వంటివి ఇన్వాసివ్ థ్రిప్స్ తీవ్రమైన ముట్టడికి మరింత కారణమైనట్టు గుర్తించారు.

చర్చల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, మామిడి తోటలో కూడా థ్రిప్స్ ఉండటం ఇప్పుడు గుర్తించామని, ఇది దిగుబడిని ప్రభావితం చేయవచ్చని పేర్కొన్నారు. తెగులు సోకిన మిరప పొలాలను తొలగించిన చోట బెంగాల్ గ్రామ్ ను వేస్తే అది కూడా ధ్రిప్స్ బారిన పడినట్టు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పండ్ల కుళ్లు ప్రధాన సమస్య

కర్ణాటక  రాష్ట్ర ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రధాన మిర్చి పండించే – బళ్లారి రాయచూర్ బెల్ట్ లో, పండ్ల కుళ్లు ప్రధాన సమస్య అని, మిర్చి పంటను ధ్రిప్స్ సమానంగా దెబ్బ తీసినా

రైతులు ధ్రిప్స్ దాడితో పెద్దగా ప్రభావితం కాలేదని అన్నారు. స్పైసెస్ బోర్డు డైరెక్టర్ మాట్లాడుతూ, పండు  కుళ్లిపోవడం వల్ల, విలువ జోడింపు ప్రక్రియ సమయంలో, తుది మిర్చి ఉత్పత్తి దాని రంగును కోల్పోతోందని, ఇది దేశం నుండి మిర్చి ఎగుమతిని ప్రభావితం చేయవచ్చని మిర్చి తయారీదారుల నుండి బోర్డుకు విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు.

మిర్చి నమూనాలు తీసుకుని విశ్లేషించాలి

ఈ సమావేశంలో వ్యక్తమైన అన్ని అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, క్రిమి సంహారక మందులను విచక్షణాయుతంగా ఉప యోగించడం, సమగ్ర సస్య రక్షణ పద్దతులను ఉపయోగించడం, చీడలను నిరోధించ డానికి, అలాగే తెగుళ్లను నిరోధించడానికి పొలాలలో మంచి పరిశుభ్రమైన విధానాలు అవలంబించాలని నొక్కి చెబుతూ,  మంచి

వ్యవసాయ విధానాలపై విజ్ఞానాన్ని అందించ డానికి ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలను నిర్వ హించాలని నరసింహారావు ఐఐహెచ్ ఆర్ , స్పైసెస్ బోర్డును కోరారు. మార్కెట్ యార్డుల నుండి మిర్చి నమూనాలను తీసుకుని చీడలు, వ్యాధుల మిర్చి నాణ్యతను ఎలా ప్రభావితం చేసిందో పరీక్షించాలని , అలాగే ధ్రిప్స్ దాడి వృద్ధి కాకుండా రైతులు  పురుగుమందులను విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల చివరి ఉత్పత్తిలో పురుగుమందుల అవశేషాల తీవ్రతను నమోదు చేయడానికి కూడా దాని నాణ్యతను పరీక్షించాలని ఆయన రెండు సంస్థలను కోరారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు  సూచించిన అంశాలను జోడించడం ద్వారా ఏకీకృత నివేదికను డిపిపిక్యూఎస్ తయారు చేసిన నివేదికతో పాటు వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి సమర్పించాలని ఆయన డిపిపిక్యూఎస్ జాయింట్ డైరెక్టర్ (పిపి)ని కోరారు.

థ్రిప్స్ పార్విస్పినస్ ఎలా ప్రవేశించింది?

వివిధ పంటలలో థ్రిప్స్ దాడిని గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచురించడం, అది ఎంత మేరకు నష్టాన్ని కలిగించింది, భారతదేశంలో థ్రిప్స్ పార్విస్పినస్ ఎలా ప్రవేశించింది , వివిధ దేశాలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారో గుర్తించడానికి అంతర్జాతీయ చీడల నిర్వహణ సంస్థలతో సంప్రదింపులు, సంయుక్తంగా పనిచేయడానికి , వివరాలు పంచుకోవడానికి శాస్త్రవేత్తలు సమష్టిగా పనిచేయాలని జివిఎల్ నరసింహారావు చేసిన అభ్యర్థనతో సమావేశం ముగిసింది.  పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో చర్చించడానికి వీలుగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Related posts

విజయనగరం కలెక్టరేట్ వద్ద అలజడి…రాత్రయినా కదలని విద్యార్థులు…!

Satyam NEWS

స్కిల్ డెవలప్ మెంట్  కేసు సర్వం డొల్ల

Satyam NEWS

మిడతల దాడి నుంచి రక్షణ ఏర్పాట్లతో సన్నద్ధం

Satyam NEWS

Leave a Comment