37.2 C
Hyderabad
March 29, 2024 20: 09 PM
Slider క్రీడలు

క్రీడలతోనే శరీరం దృఢంగా తయారవుతుంది

#aravind

క్రీడలతోనే శరీరం దృఢంగా తయారవుతుందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ తెలిపారు. బుధవారం శేర్లింగంపల్లిలోని లీగల్ గ్రౌండ్ , బి హెచ్ ఈ ఎల్ గ్రౌండ్లలో నిర్వహిస్తున్న టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ తృతీయ కుమారుడు రవి కుమార్ యాదవ్ వారి సోదరుడు రాజ్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్థం ఆర్ కె వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.

నియోజకవర్గంలో యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆటల వల్ల శారీరక మానసిక ఉల్లాసంతో పాటు ప్రతి పనిలో ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు,ఈ టోర్నమెంట్ నిర్వహణకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

నా సోదరుడు రాజ్ కుమార్ యాదవ్  జ్ఞాపకార్ధం ఆర్.కే .వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ను నియోజకవర్గంలో ఉన్న యువతలో ఉన్న ప్రతిభను వెలికతీసేందుకు గతంలో కూడా నిర్వహించామని కొంతకాలం కరోనా వల్ల నిర్వహించలేకపోయామని ,తిరిగి మొదలు పెట్టడం ఆనందంగా ఉందన్నారు.ఆటలు ఆడటం వల్ల మనలో ఉన్న ఒత్తిడి తగ్గటంతో పాటు మనం ఆటలో ఎలా గెలవటానికి ఎంత ఏకాగ్రతతో ప్రయత్నిస్తామో అలానే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఏకాగ్రత ఎలా చేయాలో నేర్చుకుంటామని రాబోయే రోజుల్లో టోర్నమెంట్ ను అన్ని డివిజన్లలో నిర్వహించి నియోజకవర్గంలో ప్రతి యువకుడి కి చేరుకునేలా ఈ టోర్నమెంట్ ను తీసుకుని వెళ్తామన్నారు.

ఇక్కడ ఆడటానికి వచ్చిన ప్రతి క్రీడాకారునికి  అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి పటేల్,  రాఘవేంద్ర రావు, రాధాకృష్ణ యాదవ్, ఏళ్లేశ్, అనికుమార్ యాదవ్ ,రమేష్, హనుమంత్ నాయక్, సోమయ్య యాదవ్, చంద్రమౌళి, అరుణ్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్ , శ్రీను.జే, రాము.జే, కౌశిక్ ,కృష్ణ బాలయ్య,దేవేందర్ ,జగదీష్ ,కిట్టు, సహదేవ్ ,పవన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాతీయ స్థాయిలో ఎన్ టీ ఆర్ నేషనల్ లెజెండరీ అవార్డ్స్

Bhavani

ఏ రోజు వచ్చిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆరోజే మిల్లులకు తరలించాలి

Bhavani

కరోనా అదుపునకు ఎంపీ ఆదాల ఆర్థిక సాయం

Satyam NEWS

Leave a Comment