36.2 C
Hyderabad
April 25, 2024 22: 32 PM
Slider రంగారెడ్డి

శ్రమకు ప్రత్యామ్నాయం లేదు

#shruticollege

సిబిఐటి కళాశాల లో శృతి కళాశాల వార్షిక దినోత్సవ సందర్బం గా రెండవ రోజు క్రీడ దినోత్సవం ఎంతో వైభవం గా జరిగింది. గత నెల రోజుల నుంచి జరుగుతున్న వివిధ క్రీడలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. 

కనుల పండుగ గా జరిగిన సాయంత్రం కార్యక్రమంలో ముఖ అతిధి గా అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు అక్షర్ అభ్యుదయ్, గౌరవ అతిథి గా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కుమారి కె మనీష హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్షర్ మాట్లాడుతూ లక్ష్యాన్ని సాధించడంలో మన అందరం ఎన్నో  అడ్డంకులను ఎదుర్కోవచ్చునని, అయితే అందుకోసం శ్రమ పడటం తప్ప ప్రత్యామ్నాయం లేదని అన్నారు.

గురువులను నమ్మడం, వారి సూచనలను అనుసరించడం ఉత్తమమైన విధానమని ఆయన అన్నారు. కె మనీష మాట్లాడుతూ విజయం సాధించడానికి క్రమబద్ధమైన ప్రణాళిక అవసరమని, క్రమమైన అభ్యాసం, అంకితభావం మరింత ముఖ్యం అని తెలిపారు.

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ రాజేశ్వరి,  శృతి 2023 వైస్ చైర్మన్ ప్రొఫెసర్ డి కృష్ణ రెడ్డి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం నుంచి అనేక కార్యక్రమములు జరిగాయి.  మిస్టర్ అండ్ మిస్ శృతి, రంగోలి, మిస్టర్ అండ్ మిస్ లిటరీటీ , ముషాయిరా , నిధి వేట, గానం మరియు నృత్య పోటీలు జరిగాయి.

Related posts

ప్రభుత్వ వైఫల్యమే మణిపూర్ ఘటన

Bhavani

ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

Sub Editor

నెంబర్ లేకుండా వాహనం నడిపితే ఛీటింగ్ కేసులు

Murali Krishna

Leave a Comment