27.7 C
Hyderabad
April 26, 2024 04: 10 AM
Slider క్రీడలు

వచ్చే నెల 6,7తేదీలలో సర్ విజ్జీ స్డేడియం వేదికగా క్రికెట్ పోటీలు..!

#sports

క్రీడ‌ల ద్వారా యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు ల‌భిస్తుంద‌ని విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ పేర్కొన్నారు. గ్రామీణ యువ‌తలో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలిక‌తీసేందుకే జ‌గ‌న‌న్న క్రీడా సంబ‌రాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని అన్నారు. ఇలాంటి క్రీడ‌ల్లో జిల్లా యువ‌త‌ భాగ‌స్వామ్యం కావ‌టం ద్వారా మంచి భ‌విష్య‌త్తును పొందాల‌ని, ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌ని ఆకాంక్షించారు.

క్రీడ‌ల‌కు త‌గిన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంద‌ని, త‌న వంతు స‌హకారం కూడా అందిస్తాన‌ని ఎంపీ పేర్కొన్నారు. సీఎం క‌ప్ పేరుతో రాజీవ్ మైదానంలో ఈ నెల 29, 30వ తేదీల్లో జ‌ర‌గ‌బోయే జిల్లా స్థాయి క్రీడా పోటీల‌ను ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్సీ సురేష్ బాబు ప్రారంభించారు.

ఈ సంద‌ర్బంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ ప్రోత్సాహం అందిస్తోంద‌ని, ఇది వ‌ర‌కు వివిధ సంద‌ర్బాల్లో క్రీడా పోటీల‌ను నిర్వ‌హించింద‌ని గుర్తు చేశారు. క్రీడాకారుల‌కు ప్ర‌భుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం ఫ‌లితంగా ఇప్ప‌టికే జిల్లా నుంచి ప‌లువురు క్రీడాకారులు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో రాణించార‌ని ఎంపీ పేర్కొన్నారు.

వారిని స్ఫూర్తిగా తీసుకొని భావిత‌ర క్రీడాకారులు కూడా జిల్లాకు మంచి పేరు తీసుకురావాల‌ని పిలుపునిచ్చారు. జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల‌కు వెళ్లే క్రీడాకారులు వ్య‌క్తిగ‌తం త‌గిన స‌హాయ‌, స‌హ‌కారాలు అందిస్తాన‌ని ఎంపీ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ముందుగా పోటీల‌కు సంబంధించిన బ్రోచ‌ర్న్ ఆవిష్క‌రించారు.

అనంత‌రం ఎంపీ, ఎమ్మెల్సీలు క‌బ‌డ్డీ మొద‌టి ఆట ఆడి క్రీడల‌ను ప్రారంభించారు.సీఎం క‌ప్ పేరుతో నిర్వ‌హిస్తున్న క్రీడా సంబ‌రాల్లో భాగంగా ఈ నెల 29, 30వ తేదీల్లో జిల్లా స్థాయి క‌బ‌డ్డీ, వాలీబాల్ టోర్నమెంటు పోటీలు రాజీవ్ మైదానంలో జ‌రుగుతాయ‌ని సెట్విజ్ సీఈవో, డీఎస్‌డీవోలు పేర్కొన్నారు.

విజ్జీ స్టేడియంలో పైన పేర్కొన్న రెండు తేదీల్లో క్రికెట్‌ కేవ‌లం పురుషుల‌కు మాత్ర‌మే జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. అలాగే జోన‌ల్ స్థాయి పోటీల్లో భాగంగా డిసెంబ‌ర్ 6, 7వ తేదీల్లో విజ్జీ స్టేడియం వేదిక‌గా క్రికెట్‌, డిసెంబ‌ర్ 8, 9వ తేదీల్లో ఇండోర్ స్టేడియం వేదిక‌గా ష‌డిల్ బ్యాడ్మింట‌న్ పోటీలు జ‌రుగుతాయ‌ని వారు వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర మేయ‌ర్ వి. విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ రేవ‌తి, జిల్లా క‌బ‌డ్డీ అసోషియేష‌న్ ప్రెసిడెంట్ కౌశిక్‌, జిల్లా యువ‌జ‌న అధికారి విక్ర‌మాధిత్య‌, సెట్విజ్ సీఈవో రామానందం, డీఎస్‌డీవో అప్ప‌ల‌నాయుడు, వివిధ క్రీడా సంఘాల ప్ర‌తినిధులు, స‌భ్యులు, అధిక సంఖ్య‌లో క్రీడాకారులు పాల్గొన్నారు.

Related posts

మహానాడులో ఒంగోలు దళిత డిక్లరేషన్ పై తీర్మానం చేయండి

Bhavani

శివ నామస్మరణతో మార్మోగిన శ్రీ పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి ఆలయం

Satyam NEWS

ఏప్రిల్ 1 నుంచి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment