27.7 C
Hyderabad
April 25, 2024 10: 56 AM
Slider ప్రత్యేకం

పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన డీజీపీ

#dgp

దక్షిణ భారతదేశం నుండి జాతీయ స్థాయి లాన్ టెన్నిస్, కుస్తీ పోటీ లో పతకాలు సాధించిన ఎపి  పోలీస్ క్రీడకారులను డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి  అభినందించారు. అదే విధంగా వారికి నగదు బహుమతిని అందించారు. నవంబర్ 15 నుంచి 18 వరకు ఢిల్లీలోని ఆర్కే కన్నా స్టేడియంలో సి‌ఆర్‌పి‌ఎఫ్ అధ్వర్యంలో నిర్వహించిన 23వ  ఆలిండియా పోలీస్ లాన్ టెన్నిస్ పోటీలలో మొత్తం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ కు చెందిన 125 మంది క్రీడకారులు పాల్గొన్నారు.

ఐ‌జి ఎల్.కే.వి రంగారావు,  క్రీడలు & సంక్షేమం నేతృత్వం లోని క్రీడాకారుల బృందం ఇందులో పాల్గొన్నారు. ఈ క్రీడల్లో  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన డిఎస్పీ  ఎన్‌.టి‌.వి రాంకుమార్ సింగిల్స్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించారు. అదే విధంగా డబుల్స్ విభాగంలో అడిషనల్ ఎస్పీలు సత్యనారాయణ, కోటేశ్వరరావు వెండి పతకాన్ని సాధించారు. 

నవంబర్ 14  నుండి 20వ తేదీ వరకు మహారాష్ట్ర పోలీస్ అధ్వర్యంలో పుణె లో నిర్వహించిన 71st ALL INDIA POLICE WRESTLING(కుస్తీ పోటీ) CLUSTER-2022  పోటీలలో మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ కు చెందిన జట్లు పాల్గొన్నాయి. ఈ కుస్తీ పోటీలో ఆంధ్ర ప్రదేశ్ అనకాపల్లి జిల్లా కు చెందిన పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ బి.నూకరాజు(pc-2145) కాంస్య పతకాన్ని సాధించాడు. 

23వ  ఆలిండియా పోలీస్ లాన్ టెన్నిస్ పోటీలు, 71st ALL INDIA POLICE WRESTLING(కుస్తీ పోటీ) CLUSTER-2022  పోటీలలో ఉత్తమ ఆటతీరుతో పతకాలు సాధించిన పోలీస్ క్రీడకారును మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. అనంతరం వారికి నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యాక్రమంలో ఐ‌జి ఎల్.కే.వి రంగారావు,  క్రీడలు & సంక్షేమం, స్పొర్ట్స్ అధికారి కే.వి. ప్రేమ్ జిత్ పాల్గొన్నారు.

Related posts

ఘనంగా భత్యాల వర్గీయుల టీడీపీ ఆవిర్భావ కార్యక్రమాలు

Satyam NEWS

ఎన్నో ఫెయిల్యూర్స్‌ చూశా.. నాన్నే నాకు స్ఫూర్తి

Bhavani

చంద్రన్నను విడుదల చేయాలి

Bhavani

Leave a Comment