కొల్లాపూర్ పట్టణంలో కొందరు వ్యక్తులు పనిగట్టుకుని కరోనా వైరస్ పై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి హెచ్చరించారు. నేటి ఉదయం నుంచి ఒక ఫొటో తో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
మహబూబ్ నగర్ ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకిన వ్యక్తి చేరాడా లేదా దానికి సంబంధించిన విషయాలను అధికారికంగా వెల్లడిస్తారు తప్ప అంతకు ముందే అసత్య వార్తలను ప్రచారం చేయడం తగదని ఆయన అన్నారు. అంతేగాని సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల లో ఇష్టానుసారంగా కరోనా వైరస్ పై తప్పుడు ప్రచారం చేస్తే పరిణామాలు సీరియస్ గా ఉంటాయని సి ఐ బి.వెంకట్ రెడ్డి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కరోనా వ్యాధికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని ఆయన అన్నారు. ఇలాంటి ప్రచారం వల్ల కొల్లాపూర్ పట్టణంలో ఒక రకమైన భయాందోళన వస్తుందని ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించిన అవాస్తమైన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తే వారిపై ఎన్‌డీఎమ్‌ఏ యాక్ట్ సెక్షన్ 54 కింద కేసును నమోదు చేస్తామన్నారు. ఈ సెక్షన్ కింద దాదాపు ఏడాది జైలు, జరిమానా ఉంటుందని సి ఐ స్పష్టం చేశారు.