29.7 C
Hyderabad
April 18, 2024 05: 46 AM
Slider ప్రత్యేకం

రష్యా వ్యాక్సిన్ తో విపరీతంగా సైడ్ ఎఫెక్టులు

RussiaVaccine

రష్యా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ అట్టర్ ఫ్లాప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించకుండానే రష్యా ప్రభుత్వ అనుమతులు పొందిన స్పూత్నిక్ వ్యాక్సిన్ ఘోర వైఫల్యం దిశగా పయనిస్తున్నది.

 మానవులపై వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభించగానే విపరీతమైన పరిణామాలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ తో మానవులపై ప్రయోగాలు ప్రారంభించగానే వికటించడం ప్రారంభమైంది.

వ్యాక్సిన్ ఇచ్చిన ప్రతి ఏడుగురితో ఒకరికి సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయి. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖయిల్ మురషోకో వెల్లడించారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారికి బలహీనంగా మారిపోవడం, కండరాల నొప్పులు, జ్వరం వస్తున్నట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా 300 మందికి స్పూత్నిక్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 14 శాతం మంది దారుణమైన తమ ఆరోగ్య పరిస్థితి విషయాన్ని పరిశోధకులకు ఫిర్యాదు చేశారు.

 అయితే ఈ వ్యాధి లక్షణాలు రోజు లేదా రోజున్నర తర్వాత పోతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

స్పూత్నిక్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ, రెండో దశ విజయవంతం అయిన నేపథ్యలో మూడో దశ ప్రారంభించారు. మూడో దశలో ఈ రుగ్మతలు బయటపడుతున్నాయి.

Related posts

నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో భారీ యాక్షన్ చిత్రం

Satyam NEWS

ఎంత సేపు ఫోన్ కొట్టినా స్పందించని 108..104..

Satyam NEWS

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దొంగల ముఠా

Satyam NEWS

Leave a Comment