30.7 C
Hyderabad
April 19, 2024 08: 06 AM
Slider సినిమా

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ ల ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ చిత్రం

#SradhaSrinath

టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధ శ్రీనాధ్ నాయికగా ఈ చిత్రం రూపొందనుంది.

వీరిద్దరూ కలసి నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. అంతేకాదు సిద్ధు జొన్నలగడ్డ ఈ  చిత్రంతో ఇటు టాలీవుడ్ లోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు వీరిద్దరి విజయవంతమైన కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్ మెంట్స్ ఈ  చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తోంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ.

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో’ రూపొందనున్న ఈ చిత్రానికి ‘నరుడి బ్రతుకు నటన’ అనే పేరును ఖరారు చేసినట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాదు… ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈరోజు  సాయంత్రం గంటలు 4.05 నిమిషాలకు విడుదల చేశారు.

చిత్రం పేరు, లోగో, ఆకర్షణీయమైన, ఉత్సుకతను కలిగించే చిత్రం ఇందులో కనిపిస్తాయి. ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే.. సంగీతానికి ఈ చిత్రకధకు సంభంధం ఉందన్నట్లు హెడ్ ఫోన్స్, హృదయం రూపంలో  ఓ జంట లోకాన్ని మరచిపోయి దగ్గరగా ఉండటం ఇది ప్రేమ కథాచిత్రమా అనిపిస్తుంది.

సహజంగా హార్ట్ సింబల్ రెడ్ కలర్ లో ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఇది బ్లూ కలర్ లో కనిపిస్తుంది…ఇలా ఎందుకు…? ప్రేమ కధకుమించి  ఈ చిత్రంలోఇంకేదో ఉంది అనిపిస్తుంది.

అదేమిటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..వేచి చూడాల్సిందే…!

పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో,నిర్మాత సూర్యదేవర నాగవంశి   నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది  దీపావళి కి  ప్రారంభం అవుతుంది. ‘నరుడి బ్రతుకు నటన‘ చిత్రానికి రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ,

సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని, సమర్పణ: పి. డి. వి. ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశి, దర్శకత్వం: విమల్ కృష్ణ

Related posts

“బ్యాక్ డోర్”తో అందరికీ బంపర్ ఆఫర్స్ రావాలి!!

Satyam NEWS

ప్రాపర్టీ చోరీ కేసుల్లోని ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ అమలు

Satyam NEWS

ఇనీషియేటీవ్: వలస కూలీల ఆకలి తీర్చడం మా బాధ్యత

Satyam NEWS

Leave a Comment