నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రావణమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలంలో ఈ రోజు ప్రారంభమైన శ్రావణమాసోత్సవాలలో లోకకల్యాణం కోసం శ్రావణమాసమంతా అఖండ శివనామ భజనలు జరుగుతాయి. శ్రావణమాసోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు వసతి, దర్శనం ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. శ్రావణమాసోత్సవాల కారణంగా ఆగస్టు 15 నుంచి 19 వరకు శ్రీస్వామివారి స్పర్శదర్శనం నిలుపుదల చేశారు. కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం ఉంటుంది. శ్రావణమాస రద్దీరోజులలో ఆర్జిత అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చనలు నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రావణమాసంలో రెండవ మరియు నాల్గవ శుక్రవారాలలో ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు.
previous post