27.7 C
Hyderabad
March 29, 2024 05: 07 AM
Slider ఆధ్యాత్మికం

పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీప‌ద్మావ‌తి

#sripadmavathiammavaru

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠ‌నాథుని(శ్రీ మహావిష్ణువు) అలంకారంలో శంకుచ‌క్రాలు, గ‌దతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

శ్రీ పద్మావతి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవ దర్శనం వల్ల యోగశక్తి కలుగుతుంది.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి జెఈవో  వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో  కస్తూరిబాయి, ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్  శేషగిరి, ఏవిఎస్వో  వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

గద్దర్ మృతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాప సందేశం

Satyam NEWS

ములుగు బిజెపి ఆధ్వర్యంలో పండిత్ దీన దయాళ్ జయంతి

Satyam NEWS

భారత్ సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధం ఎలా ఉంది?

Satyam NEWS

Leave a Comment