అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం యం. జి పురం పంచాయతి లో నూతనంగా నిర్మించిన శ్రీ పంచముఖ విష్ణుగణపతి స్వామి దేవస్థానం లో మూడు రోజులు పాటు వేడుకగా జరగనున్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. 1వ తేది ఉదయం 10-30 లకు గణపతి పూజ సృస్తి పుణ్యవాహచనం, రక్షబంధన ధారణ పంచగపు ప్రాశన, కలశస్థాపన సర్వదేవతాపూజలు, అగ్ని ప్రతిస్థాపన విలాది వాసం, ప్రధాన హోమములు, సర్వదేవతా హోమములు, నీరాజన మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి,మంగళ హారతి,తీర్ధ ప్రసాద విని యోగం నిర్వహించనున్నారు.
ఆదివారం 2 వ తేదీ చతుర్వేదస్నస్తి మంగళహారతి పెద్ద ప్రసాద వినియోగం నిర్వ హించనున్నారు. స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి సోమవారం 3 వ తేదీ ఉదయం 9 గం॥ నుండి 10 గం| లోపు శ్రీ పంచముఖ విష్ణుగణపతి,గాయత్రి అమ్మ వారు,దక్షిణ మూర్తి,వల్లీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్ర మణ్యస్వామి,శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, నాగ దేవతల విగ్రహాలు, సతీవాహన సమేత నవ గ్రహాలు,శ్రీ పంచముఖ విష్ణు గణపతి స్వామి విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణహంతి, అపభ్వత స్నానం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాదవినియోగం జరుగును.
భక్తిశ్రద్ధలతో నిర్వహించు పూజ కార్యక్రమాలు “విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ” బ్రహ్మశ్రీ దేవరకొండ భానుమూర్తిశర్మ ” ఆధ్వర్యంలో జరుగును.నిర్వహకులు భక్తులు విరి విగా పాల్గోని స్వామివారి కృపకు పాత్రులై అష్టై శ్వర్యములు, భోగ భాగ్యములు పొందవలసినదిగా కోరుచున్నారు.
