40.2 C
Hyderabad
April 19, 2024 17: 57 PM
Slider ఆధ్యాత్మికం

ప్రపంచ టూరిజం ప్రాంతంగా శ్రీ రామానుజుల వారి విగ్రహ ప్రాంగణం

#chinajeeyarswamy

వచ్చే నెలలో ఆవిష్కరించనున్న ముంచింతలలోని  శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణంలోని శ్రీ రామానుజల వారి విగ్రహం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా ముచ్చింతలలోని చినజీయర్ స్వామి ట్రస్ట్ ని మంత్రులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు రామానుజుల వారి విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేకంగా వేస్తున్న రోడ్ల పనులను పరిశీలించారు. అనంతరం ఆ ప్రాంగణంలోని దేవాలయాన్ని, రామానుజుల వారి భారీ విగ్రహాన్ని సందర్శించారు. సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ భారీ ఎత్తున నిర్మించి, త్వరలోనే భారత రాష్ట్రపతి, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించనున్న శ్రీ రామానుజ ల వారి విగ్రహం మహిమాన్వితమైనది గా నిలిచిపోతుందని అన్నారు. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా సీఎం కెసిఆర్ సమన్వయం, సహకారంతో అంతే గొప్పగా జరుగుతాయని వారు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అతిరథ మహారథులు హాజరవుతారని అన్నారు.

ఇంత గొప్ప విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వచ్చే అహూతుల కోసం ఆ స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నామని, ఇతర ఏర్పాట్లు కూడా ఘనంగా ఉంటాయని మంత్రులు తెలిపారు. ఆధ్యాత్మిక హబ్ గా మారిన తెలంగాణ కు రామానుజుల వారి విగ్రహం మకుటాయమానం కానుందని అన్నారు. సీఎం కెసిఆర్ తెలంగాణలోని దేవాలయాల పునరుద్ధరణ, పూర్ణో ద్ధరణకు నడుం బిగించారు అని తెలిపారు. యాదాద్రి ని తీర్చిదిద్దుతున్న వైనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు,  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎల్.కోటలో మరో కోవిడ్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావాలి

Satyam NEWS

టెన్నిస్ కోర్టుల పనులు వారంలోగా పూర్తి

Murali Krishna

ములుగులో వినియోగదారుల అవగాహనాకార్యక్రమం

Satyam NEWS

Leave a Comment