32.2 C
Hyderabad
April 20, 2024 20: 50 PM
Slider ఆధ్యాత్మికం

ఫణిగిరి గట్టుపై రమణీయంగా శ్రీ సీతారామకళ్యాణం

#seetaramakalyanam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఫణిగిరి గట్టుపై వేంచేసియున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం గురువారం తెల్లవారుఝామున రమణీయంగా,భక్త జన రంజకంగా జరిగింది.

ముందుగా అమ్మవారిని గజవాహనంపై,శ్రీరామచంద్ర స్వామి మూర్తులను గరుడ వాహనంపై పట్టువస్త్రాలతో, పూలమాలలతో అలంకరించి అధిష్టింప చేశారు. ఫణిగిరి గట్టు పైనుండి స్వామి వారిని దివిటీల వేలుగులో ఎదుర్కోలు మహోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. అర్చక స్వాములు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని గురించి పొగడగా, ఋత్విక్కులు అమ్మవారి వైపు నుండి శ్రవణానందకరంగా వ్యాఖ్యానించారు. పకీరా బృందం నాదస్వర కచేరి భక్తులను ఆకర్షించింది.

అనంతరం స్వామి వారిని, అమ్మవారిని కళ్యాణ మండపంలో అధిష్టింపజేసి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపించారు.ముందుగా విశ్వక్సేన ఆరాధన,పుణ్యాహవాచనం కంకణ దారణ,పాద ప్రక్షాళన,గూడ జీరధారణ వేద మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా జరిగింది.

అమ్మ వారి తరఫున,స్వామి వారి వైపు నుండి తీసుకొని వచ్చిన నూతన వస్త్రాలను పాలక మండలి సభ్యులు సమర్పించారు. భక్తుల జయ జయ ధ్వానాల,గోవింద నామాలు మధ్య బ్రాహ్మీ ముహూర్తంలో మాంగల్య ధారణ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి, స్థానాచార్యులు ముడుంబై శ్రీనివాసాచార్యులు, అర్చకులు భాస్కరాచార్యులు,మురళి కృష్ణమాచార్యులు,యాజ్ఞీకులు వేదాంతం మోహన కృష్ణమాచార్యులు, దేవాలయ ధర్మకర్తల మండలిసభ్యులు రామిశేట్టి రాము,మేరీగ గురవయ్య, వెన్న పద్మ, కోలపాటి వెంకటేశ్వర్లు,లక్క వెంకన్న,నరసింహమూర్తి,భక్తులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి,బెల్లంకొండ సైదులు గౌడ్, అశోక్,గుండా రమేష్, కోట సూర్యప్రకాశరావు,పశ్యా శ్రీనివాస్ రెడ్డి, విశేష సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణం కనులారా తిలకించి తరించారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

హ్యాపీ ఫ్రండ్ షిప్ డే: స్నేహమంటే ఇదే కదా…

Satyam NEWS

బెంగళూరులో సామూహిక అత్యాచారం: నిందితుడు రాపిడో డ్రైవర్

Satyam NEWS

దుబాయ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Satyam NEWS

Leave a Comment