అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా శుక్ర వారం రాజంపేటలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం ఎంతో వేడుకగా చేశారు. ఉదయం తెల్లవారుజాము నుంచి అమ్మవారి మూలవిరాట్ కు అభిషేకములు చేసి మహిళా మండలి వారిచే సంకీర్తన చేశారు. అనంతరం అగ్ని ప్రతిష్ట, గుండె ప్రవేశం చేశారు. భక్తులందరూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి రాజంపేటలోని ఆర్యవైశ్యులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
