శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన 2025 సంవత్సరం క్యాలెండర్ ను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కలెక్టరేట్ ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పూరి సురేష్ శెట్టిని అభినందించారు. సురేష్ శెట్టి చేపట్టే సేవాకార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఒక ఉన్నతమైన ఆర్యవైశ్య సామాజిక వర్గంలో జన్మించిన సురేష్ శెట్టి వ్యాపార దృక్పథం లేకుండా ఎలాంటి లాభంపేక్ష లేని సేవా కార్యక్రమాలను ఎంచుకోవడం ఎందరుకు ఆదర్శం అన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి తమతమ పరిధిలో సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కలెక్టర్ సూచించారు. పూరి సురేష్ శెట్టి ఎన్నో ఏళ్లుగా సమాజసేవని దైవ సేవగా భావించి లక్షల రూపాయలు వెచ్చించి శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో ఉపయోగకార్ధమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా మహమ్మారి లాంటి సమయంలో సేవలు చేసారన్నారు. వ్యాపారవేత్తలు, నేటి యువత పూరి సురేష్ శెట్టిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కలెక్టర్ ఆదర్శ సురభి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బానూరు నాగేంద్రం, గోనూరు వెంకటయ్య, పూరి బాలరాజు, చింతా కరుణాకర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్