ముత్యాల తలంబ్రాలు….మంగళవాయిద్యాలు….విశేష అలంకరణలు….వేదపండితులు వేదమంత్రోచ్చరణలు,. వెలువెరిసిన భక్తి పారవశ్యం నడుమ బుధవారం కరీంనగర్ పద్మనగర్‌లో టిటిడి ఆలయ నిర్మాణం శంకుస్థాపనలో భాగంగా సాయంత్రం శ్రీనివాసుడి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అంతకు ముందుకు మంకమ్మ తోట వేంకటేశ్వర ఆలయంలో పద్మశాలీలు పద్మావతి అమ్మవారికి సార తీసుకొని ఊరేగింపుగా పద్మనగర్ లోని కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల వేద మంత్రముల మధ్య శ్రీవారి కల్యాణాన్ని శాస్త్రత్తంగా జరిపారు. గోగుల ప్రసాద్ బృందం ఆధ్వర్యంలో అలరించిన అన్నమాచార్య కీర్తనలు. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణంలో మేయర్ సునీల్ రావు, గ్రంథాలయం చైర్మన్ అనిల్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, సిపి సుబ్బ రాయుడు. ఎమ్మెల్సీ ఎల్ రమణ.. బీసీ కమీషన్ చైర్మన్ ఒకలాభరణం కృష్ణమోహన్ రావు.. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతదితరులున్నారు
