30.7 C
Hyderabad
April 17, 2024 00: 54 AM
Slider సినిమా

శ్రీవిష్ణు హీరోగా నిర్మిస్తున్న చిత్రం రాజ రాజ చోర

raja raja chora

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు  శ్రీవిష్ణు హీరోగా నిర్మిస్తున్న చిత్రం రాజ రాజ చోర. ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. సునయన కథానాయిక. శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా నేడు తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రం నిర్మించడం తమకు ఆనందంగా ఉందని చిత్ర నిర్మాతలు జి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ తెలిపారు.

హీరో పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నాటికి చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవుతాయని వారు తెలిపారు. ఈ చిత్రంలో ఇతర పాత్రలలో తనికెళ్ల భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం వేదరామన్, సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.

Related posts

షేక్ హ్యాండ్: కొమ్మిరెడ్డి రాములు ను కలిసి మధు యాష్కీ

Satyam NEWS

పొలం వాకిట్లోకి సాగునీళ్లు…. ఇంటి పోయికాడికే తాగునీళ్లు

Satyam NEWS

తిరుపతి చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Bhavani

Leave a Comment