35.2 C
Hyderabad
April 20, 2024 18: 10 PM
Slider నల్గొండ

పోటీ పరీక్షలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు

#Srichaitanya

INTSO (ఇండియ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్) ఆధ్వర్యంలో నిర్వహించిన శాస్త్ర సాంకేతిక పోటీపరీక్షల్లో పలు విభాగాలలో తమ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కన పరిచినట్లు శ్రీ చైతన్య టెక్నో పాఠశాల ప్రిన్సిపాల్ N. ఉపేందర్ రెడ్డి తెలిపారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఇండియా నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ (INTSO) నిర్వహించి, ప్రతిభా ధ్రువ పత్రాలను, పథకాలను శనివారం అందుకున్న సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా విద్యను అభ్యసించి పోటీ పరీక్షలలో తమ విద్యార్థులు ప్రతిభను కనపరచడం అభినందనీయమని కొనియాడారు.

వివిధ పోటీ పరీక్షలలో పాల్గొనటం వలన విద్యార్థినీ,విద్యార్థుల ప్రతిభా పాటవాలతో పాటు శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. తమ పాఠశాల నుండి 29 మంది పోటీ పరీక్షకు హాజరు కాగా 21 మంది వివిధ విభాగాలలో పతకాలు సాధించి ప్రశంసాపత్రాలు పొందారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లేంపల్లి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డి జి యం సుధాకర్, అకడమిక్ డీన్ గోపి,C బ్యాచ్ ఇంచార్జ్ శ్రీనివాస రెడ్డి, ఒలంపియాడ్ ఇన్చార్జిలు చిన్న వీరబాబు, నాగ సైదులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

టిడ్కో ఇళ్ళల్లో 16న గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి

Satyam NEWS

పరిహారం కోసం పవన్ కళ్యాణ్ పవిత్ర దీక్ష

Satyam NEWS

ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల వివరాలు ఉత్తర్వులు తప్పక పాటించాలి

Satyam NEWS

Leave a Comment