తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నేడు శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే దర్శించుకున్నారు. నేడు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే, ఆయన కుమారుడు యోషిత రాజపక్సే, శ్రీలంక మంత్రి ఆర్ముగం తొండమాన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మహాద్వారం వద్ద వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీలంక ప్రధాని బృందానికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.