32.7 C
Hyderabad
March 29, 2024 12: 43 PM
Slider కరీంనగర్

అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం

#Srinivasa

దేవదేవుడు వరదహస్తుడై ఆశీర్వదించిన వేళ..స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాల కోసం భక్తజనం పోటెత్తిన సమయాన..ముక్కోటి దేవతలు హాజరై…. వేదమంత్రోఛ్ఛరణల నడుమ దిక్కులు పిక్కటిల్లేలా…
గోవిందా గోవిందా… అంటూ నామస్మరణలు మిన్నంటిన సమయాన… కరీంనగర్ లో నిర్వహించిన శ్రీనివాసుడి జగత్కాళ్యాణం… భక్తులను ఆనందపారవశ్యంతో ముంచెత్తింది… అపూర్వఘట్టం భక్త జనుల హృదయాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపింది…. శ్రీనివాసుడి కళ్యాణ మహా ఘట్టాన్ని చూసిన భక్తుల హృదయం పరవశించింది.

తెలంగాణా రాష్ట్ర బిసి సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో… కరీంనగర్ మార్కెట్ రోడ్డు వెంకటేశ్వరాలయంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి…. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి లక్ష్మీ నారాయణ స్వామి వారి పరిణయోత్సవ ఘట్టాన్ని కనులపండువలా నిర్వహించారు. యాదాద్రి,భద్రాచలం, వేములవాడ, కొండగట్టు పుణ్యక్షేత్రాలకు చెందిన పండితులతో పాటు నగరానికి చెందిన వేదపండితులు ఆర్చక స్వాములు ఆచార్య స్వాముల వేదమంత్రోఛ్ఛరణల మధ్య కళ్యాణతంతు కొనసాగింది…

ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఎర్పాటు చేసిన వేదిక పై కళ్యాణ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణతంతులో భాగంగా ఇరు దేవేరుల మధ్యలో శ్రీ వారు చిరుమందహాసంతో ఆశీనులు కాగా విశ్వక్సేన పూజ ,పుణ్యహావచనం, కలశస్థాపన, రక్షబంధనం కార్యక్రమాలను నిర్వహించి ముహూర్త సమయానికి జిలకర బెల్లం కార్యక్రమాన్ని చేపట్టారు.

మంత్రి గంగుల కమలాకర్ గారి సోదరి- బావలైన అరుణ-శంకర్ లు శ్రీవారి తరపున కళ్యాణతంతులో పాల్గొనగా తాళ్ళపాక అన్నమయ్య వారసులు తాళ్ళపాక స్వామి దేవేరి తరపున కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. బ్రహ్మోత్సవ తిరుకళ్యాణ వేడుక వేద మంత్రాలతో మంగళవాయిద్యాలు కర్పూర కాంతులు, భక్తుల గోవింద నామస్మరణతో అద్యాంతం అంబరాన్ని తాకింది. ధృవంతే రాజవరుణో ధృవందేవో బృహస్పతిః అంటూ వేదపండితుల మంత్రోఛ్చరణతో, అర్ఛక స్వాములు సర్వజగత్తుకు కల్పవల్లులు పుణ్యాల రాశులైన అమ్మవార్లకు మంగళ్యధారణ కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఆ కమనీయ దృశ్యాన్ని తనివితీర చూసిన ప్రతి హృదయం అంతులేని ఆనందంతో మురిసింది.

స్వర్ణాభరణాలతో అలంకరించిన ఉత్సవ మూర్తులను వేదిక పై కొలువు దీర్చినది మొదలు జరిగిన ప్రతిఘట్టం పరమార్థంతో నిండి మనోహరంగా అలరించింది. స్వామి వారి కళ్యాణోత్సవ వేడుకల్లో బిసి సంక్షేమం… పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు శ్రీవారి కళ్యాణానికి హాజరై… శ్రీనివాసుడికి కళ్యణాన్ని కనులార తిలకించి… భక్తితో పులకించారు. భక్తుల కోసం మంత్రి గంగుల కమలాకర్ తిరుమల తిరుపతి నుండి తెప్పించిన 15 వేల లడ్డూ ప్రసాదాలను… భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాలో శక్తి ఉన్నంత వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తానని , నేను నిమిత్తమాత్రుడినేనని, నన్ను నడిపించేది శ్రీ వారేనని అన్నారు.

కరీంనగర్ వాసులకు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ఇక్కడే దర్శించుకునేలా టీటీడీ క్షేత్రాన్ని గొప్పగా నిర్మిస్తున్నామని అన్నారు. టీటీడీ క్షేత్ర నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నగరం నడిబొడ్డున 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు 20 కోట్ల నిధులు అందించారని అన్నారు. ఇప్పుడు ఉన్న ఆలయాల నిర్మాణ సమయంలో మనం లేమని , ఇప్పుడు మన కళ్ళ ముందే ఈ ఆలయాన్ని నిర్మించడం మనం చేసుకున్న అదృష్టం అని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మికతను పంచేందుకు ఈ ఆలయాన్ని గొప్పగా నిర్మిస్తున్నామని పునరుద్ఘాటించారు .శ్రీ వారి దయ వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Related posts

మీ కోసం దేనికైనా తెగిస్తా: జనసేన అధినేత

Satyam NEWS

పెరుగుతున్న మానవ మృగాలతో సమాజానికి అరిష్టం

Satyam NEWS

విదేశాల నుంచి వచ్చిన వారు ఐసోలేషన్ లో ఉండాలి

Satyam NEWS

Leave a Comment