పవిత్ర భద్రాచల పుణ్య క్షేత్రంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం నాడు అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా పూర్తి అయింది. మిథిలా స్టేడియం లోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కల్యాణ రాముడు, సీతమ్మవారి మెడలో మూడు ముళ్లూ వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ కల్యాణం కోసం స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. అదే విధంగా శ్రీసీతారామచంద్రస్వామి వారికి సాంప్రదాయ బద్ధంగా టీటీడీ తరపున కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టువస్త్రాలు సమర్పించారు.
previous post