39.2 C
Hyderabad
April 25, 2024 15: 56 PM
Slider కర్నూలు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

#Srisailam Project

శ్రీశైలం జలాశయంలో అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమవుతుంది అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3,87,500 క్యూసెక్కులు ఉండగా డ్యాం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి 4,20,120 క్యూసెక్కుల నీటిని దిగువ  నాగార్జునసాగర్ కు  వదులుతున్నారు.

అటు ప్రాజెక్టు పూర్తిస్థాయి  నీటి మట్టం 885 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు.   ప్రస్తుతం 210.533. టీ.ఎం.సీ లుగా ఉంది.

నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది.

వి వెంకట శివుడు

Related posts

జాతీయ అవార్డుకు సీనియర్ న్యాయవాది అవ్వా విజయలక్ష్మి ఎంపిక

Satyam NEWS

కర్నాటక మద్యం, మట్కాలపై ఉరవకొండ సర్కిల్ పోలీసుల ఉక్కుపాదం

Satyam NEWS

రిమైండర్: జగనన్నా మమ్మల్ని మరచిపోయావా అన్నా?

Satyam NEWS

Leave a Comment