శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాలు మంగళవారం నుండి నిర్వహిస్తున్నట్లు వెంకటశర్మ తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ,వినోబా నగర్ కాలనీలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఈనెల 29-11-2022 మంగళ వారం నాడు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని వేద బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నర్వ వెంకటేశ్వర శర్మ తెలిపారు.సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాలలో భాగంగా ఈనెల 28న సోమవారం నాడు ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ గణపతి పూజ, ఆంజనేయ స్వామికి మహా హోమం, పూర్ణాహుతి , సాయంత్రం పుష్పార్చన అనంతరం సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరుసటి రోజు 29న ఉదయం కాల పూజలతో పాటు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణ భక్తులతో పాటు, జన్మ రిత్యా వివాహ దోషం ఉన్నవారు,సంతానం లేని వారు, ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వడిబియ్యం సామూహిక కార్యక్రమం ఉంటుందన్నారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ వేద ఆశీర్వచనం, భక్తులకు సామూహిక అన్న ప్రసాద పంపిణీ ఉందని తెలిపారు భక్తులు పూజలలోఅధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. మరిన్ని వివరాలకు చరవాణి నెంబర్లు 9505403907, 7780493265, 9505687411 సంప్రదించాలని కోరారు.