39.2 C
Hyderabad
April 25, 2024 18: 05 PM
Slider నల్గొండ

పాటల పోటీలో శ్రీవర్ధన్ కు అంతర్జాతీయ బహుమతి

#SreeVardhan

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన రెండవ తరగతి విద్యార్థి సాగర్ల శ్రీవర్ధన్ జానపద విభాగం పాటల పోటీలో అంతర్జాతీయ స్థాయి ప్రత్యేక బహుమతి సాధించాడు. నృసింహ సేవా వాహిని చారిటబుల్ ట్రస్ట్ భద్రాచలం వారు ఆన్లైన్ వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలలో వివిధ దేశాల చిన్నారులు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా జానపద విభాగంలో శ్రీవర్ధన్ ఈ బహుమతి సాధించాడు. నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని నాగార్జున  కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, సృజన సాహితీ నల్గొండ జిల్లా అధ్యక్షులు పెరుమాళ్ళ ఆనంద్ చేతులమీదుగా శ్రీవర్ధన్ అందుకున్నాడు.

ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ శ్రీవర్ధన్ మంచి గాయకుడిగా ఎదగాలని ఆశీర్వదించారు. సృజన సాహితీ అధ్యక్షులు పెరుమాళ్ళ ఆనంద్ మాట్లాడుతూ  శ్రీ వర్ధన్ గాయకుడే కాక మంచి కథకుడుగా  కూడా రాణించగలడని, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం లో తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతను పోషించాలన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వర్ధన్ తల్లిదండ్రులు సాగర్ల సత్తయ్య,  ధనలక్ష్మి, శ్రీనందన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టులను విస్మరిస్తే ప్రభుత్వాలకు పతనం తప్పదు

Satyam NEWS

వాతావరణ శాఖ చెప్పినట్టు గానే..వర్ష సూచనలు…!

Satyam NEWS

రక్తదానం చేసి ఒక తల్లిని కాపాడిన జర్నలిస్టు

Satyam NEWS

Leave a Comment