కేరళలోని పలక్కడ్ పుట్‌బాల్ స్టేడియంలోగ్యాలరీ కూలి సుమారు 50 మంది గాయడ్డారు. నిర్వాహకులు ఆదివారం స్టేడియంలో ఛారీటీ పుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఒక్కసారిగా కూలింది. ఈ మ్యాచ్‌కు అతిథులుగా ఇండియన్ పుట్‌బాల్ లెజెండ్స్ విజయన్, బైచింగ్ భూటియా హాజరయ్యారు.
సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి విజయన్, బైచింగ్ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలు ఎవరికీ కాలేదని పోలీసులు తెలిపారు.