మౌని అమావాస్య రోజున లక్షలాది మంది యాత్రికులు పవిత్ర స్నానానికి తరలిరావడంతో మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మధ్య సంగంలో తొక్కిసలాట పరిస్థితి తలెత్తడంతో అనేక మంది గాయపడ్డారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని, అఖారాలు మౌని అమావాస్య కోసం వారి సాంప్రదాయ ‘అమృత స్నాన్’ను నిలిపివేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు మేళా ప్రాంతంలోని సంగం, ఇతర ఘాట్‌లలో స్నానాలు చేయడం కొనసాగించారు. మేళా కోసం నియమించిన స్పెషల్ డ్యూటీ అధికారి ఆకాంక్ష రాణా మాట్లాడుతూ, “సంగం వద్ద అడ్డంకి విరిగిపోవడంతో కొంతమంది గాయపడ్డారు. ఆసుపత్రి పాలయ్యారు. గాయపడిన వారి సంఖ్య మాకు ఇంకా ఖచ్చితంగా తెలియలేదు” అని అన్నారు.
previous post