36.2 C
Hyderabad
April 25, 2024 20: 53 PM
Slider ముఖ్యంశాలు

భక్తుల కోసం మేడారం లో స్టార్ మా తాత్కాలిక గృహాలు

Madaram Maa

ప్రముఖ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ స్టార్ మా వారు మేడారం జాతరను పురస్కరించుకొని అమ్మవార్లను సందర్శించే భక్తుల కోసం వసతి కల్పించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ లో భాగంగా, ఈ తాత్కాలిక గృహాలు ఏర్పాటు చేశారు.

ఎల్‌ఈడీ స్క్రీన్‌తో బిగ్ ఎంటర్టైన్మెంట్ జోన్‌తో పాటు సౌకర్యవంతమైన స్థలంతో మిగిలిన ప్రాంతంలో తాత్కాలిక గృహాలు పార్కింగ్ 1 (ప్రైవేట్ వెహికల్స్ ఏరియా రూట్) భూపాల పల్లి క్రాస్ రోడ్డు సమీపంలో నార్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ ‘కుంభమేళా’ అయిన సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ జాతర 8 వరకు ములుగు జిల్లాలోని మేడారంలో సాగుతుంది. సుమారు మూడు కోట్ల మంది భక్తులు జాతరకు హాజరవుతారని అంచనా. స్టార్ మా అనేది స్టార్ టీవీ నెట్‌వర్క్‌లో ఒక భాగం. ఇది గ్లోబల్ మీడియా సంస్థ 21 వ సెంచరీ ఫాక్స్ పూర్తిగా యాజమాన్యంలో ఉంది.

స్టార్ మా తెలుగు భాషా మార్కెట్లో శక్తివంతమైన, వినూత్నమైన, ఆహ్లాదకరమైన ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్‌కు ప్రసిద్ధి చెందిన ప్రముఖ తెలుగు టివి ఛానల్ నెట్‌వర్క్. అంతే కాకుండా సాధారణ వినోదం, చలనచిత్రాలు ప్రేక్షకులకు అందించే ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్.

Related posts

గోల్నాక లో మహిళలకు ఘన సన్మానం

Satyam NEWS

భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

Satyam NEWS

ఇయర్ ఎండింగ్: వరుసగా పోలీస్ బాస్ పోలీస్ స్టేషన్ల తనిఖీ

Satyam NEWS

Leave a Comment