28.2 C
Hyderabad
April 20, 2024 14: 41 PM
Slider నల్గొండ

కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలం

#Roshapati

అసంఘటిత రంగంలోని కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యారని CITU జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు గురువారం జరిగిన (CITU అనుబంధ) బిల్డింగ్,సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్  సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోషపతి  మాట్లాడుతూ కరోనా కాలంలో  కార్మికులందరినీ ఆదుకుంటామని చెప్పిన కెసిఆర్ పూర్తిగా మర్చిపోయాడని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎస్ కె బాబుల్, ఉపాధ్యక్షుడు ఎస్ డి నాగుల్ మీరా,ఉప్పతల వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఉప్పతల నరేష్,సహాయక కార్యదర్శి కర్నె నాగయ్య, గురవయ్య, రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్, అబ్దుల్లా,తమ్మిశెట్టి రాజు, శేఖర్,సుభాని,లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజ్యాంగం పై అందరికి అవగాహన ఉండాలి

Satyam NEWS

చంద్రబాబు మీటింగ్ వద్ద అపశ్రుతి: 5 గురు మృతి

Satyam NEWS

Heats off: వృద్దురాలికి ఆశ్ర‌యం క‌ల్సించిన ఏటీకే సంస్థ‌…!

Satyam NEWS

Leave a Comment