36.2 C
Hyderabad
April 24, 2024 20: 53 PM
Slider నల్గొండ

గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వాలు విఫలం

#CPMNalgonda

రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి గా విఫలం అయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.

ఆయన శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం లోని చిట్యాల మండల కేంద్రంలో గలా ధాన్యం కొనుగోలు కేంద్రం ను పరిశీలించి మాట్లాడుతూ వర్షాలకు తడిసిన దని, నాసిరకంగా ఉన్నదని, తేమగా ఉన్నదనే సాకులతో ధాన్యం కొనుగోలు జరుపటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేరళ ప్రభుత్వం తరహాలో రైతులకు ఒక క్వింటాలుకు 800రూ, ల మాదిరిగా తెలంగాణా ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్తి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించినా సకాలంలో బ్యాగులు,తార్బాళు   ఇచ్చి  కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు.

ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జిట్ట నగేష్ ,అవిశెట్టి శంకరయ్య, పామనుగుల్ల అచ్చాలు, నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు బడే అజయ్ కుమార్,  గోపగోని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో సిబిఐటి విద్యార్ధులు

Satyam NEWS

Tribute: రససిద్ధుడు మంగళంపల్లి బాలమురళి

Satyam NEWS

ప్రధాని మోడీ విశాఖ టూర్… పోలీసు దిగ్బంధంలో విశాఖ మహానగరం…!

Bhavani

Leave a Comment