25.7 C
Hyderabad
June 22, 2024 05: 12 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఖాతాదారులపై భారం మోపనున్న ఎస్ బి ఐ

sbi

ట్రాన్సాక్షన్ చార్జీలను ఎస్ బి ఐ భారీగా పెంచబోతున్నది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చే ఈ కొత్త నిబంధనలు ఖాతాదారులకు పెనుభారంగా మారబోతున్నాయనడంలో సందేహం లేదు. కొత్త నిబంధనల ప్రకారం నెలకు మూడు సార్లు మాత్రమే బ్యాంకులో ఉచితంగా డబ్బు డిపాజిట్ చేయగలరు. ఈ పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు రూ.50 చెల్లించాల్సి వస్తుంది. దీనికి జీఎస్‌టీ అదనం. ఐదో డిపాజిట్ తర్వాత నుంచి బ్యాంక్ తన కస్టమర్ల నుంచి రూ.56 వసూలు చేస్తుంది. చెక్ బౌన్స్ అయితే అదనంగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం లావాదేవీల సంఖ్య మెట్రో నగరాల్లో 10కు పెరగనున్నాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ఇది వర్తిస్తుంది. నాన్ మోట్రో ప్రాంతాల్లో ఎలాంటి చార్జీలు లేకుండా ఎస్‌బీఐ ఏటీఎంలో 12 లావాదేవాలు నిర్వహించొచ్చు. అదే ఇత బ్యాంకుల ఏటీఎం అయితే 5 లావాదేవీలు మాత్రమే ఉచితం. ఎస్ బి ఐ వద్ద శాలరీ అకౌంట్ కలిగిన వారు ఎస్‌బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ సేవలు ఉచితం. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేస్తేనే ఈ ఫెసిలిటీ ఉంది. అదే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఈ సేవలు పొందాలంటే చార్జీలు చెల్లించాలి. ఆటో, హోమ్ లోన్స్ సహా రిటైల్ లోన్స్ అన్నీ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లతో అనుసంధానం కానున్నాయి. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు ఈ పని చేస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి రూల్ అమలులోకి వస్తుంది.

Related posts

చట్టబద్ద అనుమతులే లేని ఎల్ జి పాలిమర్స్

Satyam NEWS

జీఎంఆర్ ‘వాట్సాప్ వర్చువల్ అసిస్టెంట్ చాట్-బాట్’

Sub Editor

స్ట్రాటజీ: ఎంపీపీ వ్యూహంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

Satyam NEWS

Leave a Comment