పక్కా ప్లాన్ తో బీజేపీ అధిష్టానం….ఎమ్మెల్సీ సొము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బరిలోకి దించింది. పూర్వపు అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తప్పించి…మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి అయిన సోమువీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించడం జరిగింది.
ఇటీవలే విజయనగరం జిల్లా రామతీర్ధం అంశం విషయంలో మరింతగా మీడియా కూడా సోము వీర్రాజును హైలైట్ చేసింది.ఈ క్రమంలోనే మరోసారి విజయనగరం జిల్లాకు రావడం చర్చనీయాంశమైంది. తన పర్యటన వివరాలు కేవలం పార్టీ జిల్లా అధ్యక్షురాలుకు మాత్రమే తెలుసన్నట్టు సమాచారం.
రాజమండ్రి నుంచీ విశాఖ కు అక్కడ నుంచీ ఈ నెల 23న విజయనగరం ఎస్వీఎన్ లేక్ ప్యాలస్ కు వచ్చి కాస్సేపు అక్కడే ఉన్నారు. అక్కడ నుంచీ నేరుగా రామభద్రపురం వెళ్లారు.కాగా స్వతహాగా హిందువు అయిన సొమువీర్రాజు గారికి కాస్త యోగ,ధ్యానం వంటి అంశాలపై ఎక్కువ ,మక్కువ.
ఇటీవలే యోగాపై మైత్రేయి లాంటి ప్రముఖుల ఉపన్యాసాలు కూడా చూసారు.కాగా మైత్రేయి లాంటి ప్రముఖ వ్యక్తే..రిటైర్డ్ డీఎంఅండ్ హెచ్ఓ.ప్రాణాయామపు గురువు వద్ద ఉపదేశం పొందినట్టు తెలుసుకున్నారు….బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.
శరీరంలో అన్ని రుగ్మతలకు యోగా ప్రకృయ సరైన మార్గమని…అది గురువు ద్వారా పొందాలని తెలుసుకున్నారు. ఈ మేరకు విశాఖలోని ప్రముఖ సుజోకో డాక్డర్ హరగోపాల్ ద్వారా…రామభద్రపురంలో ఉన్న యోగా గురువును కలిసినట్టు సమాచారం.