రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ను రేపు కలవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించుకున్నారు. రాజ్‌భవన్‌లో ఆయన గవర్నర్‌తో భేటీ అవుతారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేసిన అనంతరం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనపై తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయడానికి గల కారణాలను ఆయన గవర్నర్ కు వివరించనున్నారు. ఎస్ఈసీ నిర్ణయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. బందర్ రోడ్డు లో ఎస్ ఈ సీ కార్యాలయానికి పోలీసులు భద్రత పెంచారు.
previous post