బిచ్కుంద మండల కేంద్రంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మోకాలపై కూర్చుని తమ నిరసనను తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి తమని తమ కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గణపతి ఉపాధ్యక్షులు బాలయ్య కార్యదర్శి వీరేశం చిన్నమొల్ల సాయిలు, సీమ శ్రీనివాస్ జ్ఞానేశ్వర్ నాగ్ గొండు వెంకట్రెడ్డితోపాటు ఆయా గ్రామాల్లో క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.