40.2 C
Hyderabad
April 24, 2024 17: 22 PM
Slider కరీంనగర్

గంజాయి సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదు

#ramagundampolice

గంజాయి సరాపరా చేసిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీపీ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. రామగుండం పోలీసు కమిషనర్ కార్యాలయంలో మంచిర్యాల ,పెద్దపల్లి జోన్ పోలీస్ అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులుతో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణ గురించి  సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, డిజిపి ఎం మహేందర్ రెడ్డి ల ఆదేశాల మేరకు దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తు పదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అభివృద్ధికి అవరోధంగా గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు లేకుండా చేయ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. యువతను ప్రజలను రక్షించవలసిన బాధ్యత మన పైనే ఉందన్నారు. గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు.

కమిషనరేట్ పరిధిలో  వంద శాతం గంజాయిని నియంత్రించి గంజాయి రహిత కమీషనరేట్ గా  మార్చడమే లక్ష్యమని,  ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించి సమూలంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలించాలన్నారు. గంజాయి పండించే వారిపై, రవాణా చేసే వారిపై, వ్యాపారం చేసే వారిపై, తీసుకొనే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని,. అలవాటు ప్రకారం చేసే వారిని గుర్తించి పి‌డి యాక్ట్ లు నమోదు చేయాలని తెలిపారు.

గంజాయి, గుడుంబా , డ్రగ్స్ పైన పోలీస్ , ఎక్సైజ్ అధికారులు కలసి సమన్వయం తో  టీమ్ లు ఏర్పాటు చేసుకొని పని చేయాలని ,స్కూల్ హెడ్ మాస్టర్ లు కళాశాల ప్రిన్సిపాల్ లు, ప్రజా ప్రతినిధులతో కలసి మీటింగ్ లు ఏర్పాటు చేసి తమ తమ ప్రాంతాలను డ్రగ్,గంజాయి , గుడుంబా రహిత ప్రాంతాలుగా మార్చుకోవాలని సూచించారు,

గతంలో మత్తు,డగ్స్ సంబంధించిన నేరాల్లో  కేసులు నమోదు అయినటువంటి నిందితుల వివరాలను (డి,ఒ,పి,ఎమ్,ఎస్) (Drug Offenders Profiling Analysis & monitoring Systems ) అనే వెబ్సైట్లో  అప్ లోడ్ చేస్తామని చెప్పారు. నిందితుల వివరాలు రాష్ట్రం మొత్తంలో ఎక్కడి నుండైనా వారిని సెర్చ్ చేయవచ్చన్నారు.

రోడ్డు రవాణా  రైల్వే మార్గాలలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని,ఇంతకు ముందు ఈ విధమైన కేసులలో నేరస్తుల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని,ఇందు కోసం పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి , గుట్కా రవాణాకు పాల్పడిన వ్యక్తుల సమాచారంతో పాటు గంజాయి సాగు చేసిన వ్యక్తుల, సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయడంతో పాటు, గంజాయి వినియోగించే వారి సమాచారాన్ని కూడా అధికారులు సేకరించాలని తెలిపారు.

గంజాయి రవాణాకు పాల్పడిన నిందితులపై అవకాశాన్ని బట్టి వారిపై పీడీయాక్ట్ లను నమోదు చేయడంతో పాటు గంజాయి నిందితుల నేరాలు కోర్టులో రుజువయ్యే విధంగా నైపుణ్యంతో కూడిన దర్యాప్తుతో పాటు  తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన లేబర్ , కంపెనీల్లో పని చేస్తున్న వారిపై నిఘా ఉంచాలన్నారు.

ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థపై నిఘా ఉంచి అకస్మాత్తుగా వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలన గురించి ప్రత్యేక  టాస్క్ ఫోర్స్ టీమ్స్  ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.గంజాయి సాగు ,సరఫరా ,సేవించడం చేసే వారి సమాచారం తెలిస్తే 9440900683 నెంబర్,డయల్100,స్థానిక పోలీస్ అధికారులకు  సమచారం అందించాలని,సమచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. చట్టవ్యతిరేకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు.

Related posts

క్లీన్ ఇమేజ్ ఉన్న టీఆర్ఎస్ క్యాండిడేట్ వాణిదేవి

Satyam NEWS

జొన్నలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా…

Satyam NEWS

సొంతూరికి పోతున్నా . . .

Satyam NEWS

Leave a Comment