32.2 C
Hyderabad
April 20, 2024 22: 07 PM
Slider కడప

రహదారుల భద్రత కు పటిష్టమైన చర్యలు చేపట్టాలి

#road safety

ప్రజల ప్రాణ భద్రత.. మనందరి సామాజిక బాధ్యత అని, ఆ దిశగా జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు సంబందిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన హాలులో.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యధిక శాతం రోడ్డు ప్రమాదాల కారణంగానే.. ప్రజల ప్రాణాలు కోల్పోవడం జరుగుతోందన్నారు. జనాభాతో పాటు వాహనాల వినియోగం కూడా పెరుగుతున్న నేపథ్యంలో.. రవాణా శాఖ, అనుబంధ శాఖల అధికారులు రహదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి.. వాహన ప్రమాదాలను అరికట్టే దిశగా భద్రత చర్యలు చేపట్టాలన్నారు.

ముఖ్యంగా.. వచ్చే నెలలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో.. అన్ని విద్యాసంస్థలకు సంబందించిన వాహనాల కండీషన్ ను తనిఖీ చేసి.. ఫిట్ నెస్ బాగుంటేనే.. నిర్వహణకు అనుమతించాలని రవాణా శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు.

వాహనాలు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో బ్యారికెడ్, స్టాపర్స్, ప్రమాద సంకేత సూచికలను పొందుపరచాలని పోలీస్ మరియు ఇంజనీరింగ్ అధికారులని ఆదేశించారు. ముఖ్యంగా స్కూల్స్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ప్రతి పెట్రోల్ బాంక్ వద్ద, అన్ని ప్రధాన వాణిజ్య సముదాయాలు, వాణిజ్య

జంక్షన్ల వద్ద, అన్ని డ్రగ్ స్టోర్ల వద్ద సిసి కెమేరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోడ్ సేఫ్టీ కమిటీలో సమన్వయం అయిన శాఖల వారీగా.. రహదారులపై గత నెలలో జరిగిన ప్రమాదాలను విశ్లేషించి, వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో.. రోడ్ సైడ్ డంపింగ్ చర్యలను పూర్తిగా అరికట్టాలన్నారు.

రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో.. 108 వాహన సేవలు సకాలంలో అందేలా సంబందిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 108 లో విధులు నిర్వహించే టెక్నీషియన్ ల నైపుణ్యతను మొరోసారి పరీక్షించి.. మెరుగు పరచాలన్నారు.

అలాగే రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు, అధికంగా గాయపడ్డ వారికి అన్ని సమయాల్లో అత్యవసర చికిత్సలు అందించేందుకు అనుమతించిన నగరంలోని.. శ్రీ హోలిస్టిక్, సన్ రైస్, హిమాలయ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను వేగవంతంగా అందించేలా చర్యలు తీసుకుని.. క్షతగాత్రులను ప్రాణాపాయం నుండి బయట వేయాలన్నారు.

జిల్లాలో ఎన్ఫోర్స్ మెంట్ చర్యలను మరింత కఠినతరం చేయాలని.. అతివేగం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, బస్సులు, ఇతర వాహనాలలో అధిక లోడుతో సరుకు, ఇతర సామగ్రి రవాణా చేసే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవలసిందిగా రవాణ శాఖ అధికారులను ఆదేశించారు. అనధికారికంగా జాతీయ రహదారుల్లో ఎక్కడా కూడా రోడ్డు పక్కన వాహనాలు ఆగకూడదన్నారు. ప్రతి రహదారి మలుపు వద్ద సూచిక బోర్డులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు.

ప్రయివేటు, ట్రాన్స్పోర్టు వాహనాల వేగాన్ని నియంత్రించేలా, అలాగే.. ఫోర్ లైన్ రోడ్లలో కుడివైపు లైన్ లో మాత్రమే వాహనాలు వెళ్లేలా.. వాహనదారుల్లో అవగాహన కల్పించాలన్నారు. అలాగే.. అన్ని విద్యా సంస్థల్లో రహదారుల భద్రతకు అవసరమైన నియంత్రణ చర్యలు, అత్యవసర సహాయక చర్యలు, నియమ నిబంధనలు మొదలైన వాటిపై అవగాహన కల్పించాలన్నారు.

ముఖ్యంగా.. యువతకు బైకులు, కార్లను ఇచ్చే తల్లిదండ్రులు కూడా.. అతి వేగం, రోడ్లపై బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని సూచిస్తూ.. రోడ్డు భద్రతా, ప్రమాదాలను అరికట్టడంలో తల్లిదండ్రులు సామాజిక బాధ్యతను స్వీకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో నగర కమీషనర్ ప్రవీణ్ చంద్, ఏ ఎస్పీ తుషార్ డూడీ, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కమిటీ మెంబర్లు.. ఆర్టిఓ, ఇంచార్జి డిటిసి సుశీల, ట్రాఫిక్ పోలీసు అధికారులు, ఎంవీఐలు, డి.ఎం.హెచ్.ఓ డా. ఖాదర్ వలీ, డి.సి.హెచ్.ఎస్, రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్, ఆర్ & బి, విద్యుత్ శాఖల ఎస్.ఈ లు, మున్సిపల్ కమిషనర్లు,

నేషనల్ హై వేస్ అధికారులు, రోడ్ సేఫ్టీ డి.ఎస్.పి, ఇరాడ్ జిల్లా కోఆర్డినేటర్, రోడ్డు భద్రత ఎన్.జి.ఓ.ల అధ్యక్షులు, కమీటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా లెసన్: సమస్య వారిది కాదు దేశానిది

Satyam NEWS

కడప తెలుగుదేశం అధ్యక్షుడికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

లద్దాక్ పై మళ్లీ మొదలైన భారత్ చైనా సైనికాధికారుల చర్చలు

Satyam NEWS

Leave a Comment