వనపర్తి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్ధరాత్రి 11 గంటలకు చిట్యాల విద్యార్థులు దాబాలలో మత్తు పదార్థాలు సేవిస్తూ కనిపించారని బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శివనాయక్ వనపర్తి జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాదులో తెలిపారు.ఈ సమస్యపై విచారణ చేసి అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేత గండు శివ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్