28.7 C
Hyderabad
April 20, 2024 09: 46 AM
Slider ముఖ్యంశాలు

విద్యార్థులు పరీక్షల ఒత్తిడికి గురికావద్దు

#udaikumarias

విద్యార్థులు పరీక్షలను ఆస్వాదిస్తూ రాయాలి తప్ప ఒత్తిడికి గురికావద్దని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కోరారు. విద్యార్థులకు పరీక్షల సీజన్ ప్రారంభమవుతుందని, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుండి పడవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. పరీక్షల సమయంలో  విద్యార్థులు అనవసర భయం ఆందోళనలకు గురి కావడం వల్ల పరీక్షలు సరిగ్గా రాయలేరన్నారు. అందువల్ల విద్యార్థులు ఎట్టి పరిస్థితిలోనూ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత మనస్తత్వం తో పరీక్షలు రాయాలని అప్పుడే మంచి ఫలితాలు సాధిస్తారని సూచించారు. 

ఒకవేళ పరీక్షల సమయంలో ఏదైనా అనారోగ్యానికి గురి అయిన లేక మరే ఇతర కారణాల చేత పరీక్ష సరిగ్గా రాయనున్న మనస్తాపం చెందవద్దని ఎలాగూ వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి కాబట్టి విద్యా సంవత్సరం సైతం కోల్పోయే ప్రమాదం లేదన్నారు.  అందువల్ల జిల్లాలోని విద్యార్థులు ఏ ఒక్కరు భయాందోళనలు పడకుండా మంచి మానసిక స్థైర్యంతో సిద్ధం అయి పరీక్షలు రాయవలసిందిగా తెలిపారు. జిల్లా యంత్రాంగం తరపున పరీక్షల సమయంలో విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు రూట్ వారిగా బస్సు, తాగు నీరు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స, శానిటేషన్ వంటి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Related posts

పాలిమర్స్ బాధితుల్ని అవమానించిన మంత్రి అవంతి

Satyam NEWS

సిఎంకు అండగా ఉందాం సాక్షిని నిలబెట్టుకుందాం

Satyam NEWS

దగ్గు మందును మత్తు మందులా అమ్ముతున్నాడు

Satyam NEWS

Leave a Comment