32.2 C
Hyderabad
March 28, 2024 21: 17 PM
Slider మహబూబ్ నగర్

జాతీయ సమైక్యత ర్యాలీలో విద్యార్థుల అవస్థలు

#students

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత ర్యాలీలో విద్యార్థుల అవస్థలు అంతా ఇంతా కాదు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం బిఎస్ఎన్ఎల్ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముందుగా విద్యార్థుల తో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో విద్యార్థులు సోమ్మసిల్లిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అదేవిధంగా సభకు హాజరైన విద్యార్థులకు త్రాగడానికి నీరు లేక డ్రీహైడ్రేషన్ కు గురయ్యారు. చెడు ఆహారాన్ని  వాసన వస్తున్న ఆహారాన్ని ఇవ్వడంతో ఇంటికి వెళ్లి అస్వస్థకు గురయ్యారు.కొందరు విద్యార్థులు వాసన పసిగట్టి ఆహారాన్నిపారవేసిన సంఘటన చోటుచేసుకున్నాయి.

కొందరు తల్లిదండ్రులు తిండి నీరు లేకుండా విద్యార్థులను అవస్థల పాలు చేసిన పాఠశాల యజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యజమాన్యుం మాకు తెలియకుండా  ర్యాలికి తీసుకపోయి  అస్వస్థకు  గురి చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

మంత్రి వ్యాఖ్యలపై హేమా మాలిని స్పందన

Sub Editor

ఎమ్మెల్యే మాగంటికి ‘నలందా’ రాజు సన్మానం

Satyam NEWS

ఒపీనియన్: లాక్ డౌన్ ఎత్తేస్తే అందరం మునుగుతాం

Satyam NEWS

Leave a Comment