36.2 C
Hyderabad
April 25, 2024 20: 50 PM
Slider మహబూబ్ నగర్

కలలు సాకారం ఐయ్యేందుకు ఆత్మవిశ్వాసమే కీలకం

#deo

విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ యం. గోవిందరాజులు అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని యుపిఎస్ మరికల్, తిమ్మాజిపేట ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల కస్తూరిబా గాంధీ విద్యాలయం, ప్రాథమిక పాఠశాల ఎదిరేపల్లి మరియు బిజినపల్లి కేజీబీవీని ఆయన సందర్శించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి మహిళా ఉపాధ్యాయులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ ఈ ప్రపంచంలో నిజమైన హీరోలు విద్యార్థులే అని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా మానవ విలువలను పెంపొందించే దిశగా ఆలోచనలు చేయాలని, ఉపాధ్యాయులు ఆ దిశగా పనిచేయాలని ఆయన అన్నారు. ఆత్మస్థైర్యం నింపడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మహత్యా ధోరణిని వారు విడనాడేలా చేయవచ్చున్నారు.

ఇటు కుటుంబానికి, అటు దేశానికి ప్రయోజకలుగా  ఉండాల్సిన వారు అర్ధంతరంగా జీవితాలను ముగించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి గల కారణాలు ఏమో పరిశిలించి, ఆ కారణాలను సరిచేసి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపే మార్గాలను అలోచించాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందన్నారు. ఈ తరం విద్యార్థులకు కావాల్సిన అంత ఆత్మస్ధైర్యం వారి కుటుంబాల నుండి వారికి అందక పోయినప్పటికీ తరగతి గదిలో ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థితో మమేకమై మాట్లాడుతూ బోధనా పద్ధతులను అనుసరించాలన్నారు.

సమాజానికి భవిష్యత్తు మూల స్తంభాలుగా భావించే విద్యార్థుల్లో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు ఎందుకంటే కొంతమంది విద్యార్థులకు జీవితంలో నమ్మకంగా ఉండడానికి అధిక ప్రోత్సాహం అవసరం కాబట్టి తల్లిదండ్రులు తమ పాఠశాలలో చదివే విద్యార్థులను ఆత్మనూనత్త భావం లేకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడానికి తరగతి గదిలో మరింత శ్రద్ధ అదనపు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

రానున్న పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా కలలు కంటూనే ఆ కలలను సహకారం చేసుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ప్రతి విద్యార్థి పై ఉందన్నారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మరికల్ ప్రాథమిక ఉన్నత  పాఠశాలలో కొనసాగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట మండల విద్యాధికారి శ్రీనివాస్ ఉన్నారు.

Related posts

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

కరోనా నుంచి కోలుకున్న సినీ నటి జెనీలియా

Satyam NEWS

కేంద్ర బడ్జెట్లో అసంఘటిత రంగ కార్మికులకు అన్యాయం

Satyam NEWS

Leave a Comment