26.2 C
Hyderabad
February 14, 2025 01: 19 AM
Slider క్రీడలు

విద్యార్థులను క్రీడల పట్ల ప్రోత్సహించాలి

#sports

విద్యార్థులను విద్యతోపాటు క్రీడల పట్ల ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాల చైర్మన్ కొండూరు శరత్ కుమార్ రాజు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాజపేట మండలం శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలలో శుక్రవారం 2024 -25 సంబంధించిన శాన్వి సంగ్రామం క్రీడా పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. ఇందులో భాగంగా ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ రాజు మాట్లాడుతూ చదువుతోపాటు ఆటలు కూడా విద్యార్థి ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతాయని వివరించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల జ్ఞాపకశక్తితో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. ప్రస్తుతం క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ఉద్యోగాలు, కళాశాలలో సీట్లు కొరకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.

తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మొదటి నుంచి ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థులను క్రీడల పట్ల ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.అనంతరం మండలంలోని పలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల నుంచి క్రీడా పోటీలకు హాజరైన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. చివరగా టాస్ వేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాన్వి పాఠశాల విద్యార్థులు చేసిన పిరమిడ్ విన్యాసాలు తోటి క్రీడాకారులను అధ్యాపకులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షులు వై.సుబ్రహ్మణ్యం రాజు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకట నరసయ్య, శాన్వి పాఠశాల ప్రిన్సిపల్ విజయనిర్మల డైరెక్టర్ కొండూరు భరత్ కుమార్ రాజు మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ రాజు, వైస్ ప్రిన్సిపల్ జయశ్రీ పీఈటీలు సురేష్,ఆనంద్ , జవ్వాజి మోహన్ , ఉద్దండం ప్రభాకర్ లతోపాటు శాన్వి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం  పీఈటీలు ఎం ఈశ్వర నాయక్ ,ఎన్ సరిత, బి.పెంచలమ్మ బి. నాగరాజు, ఎం రమేష్ జి . ఆనందమ్మ, ఎస్ సుధాకర్ ఎన్వి రమణ లు నందలూరు మండలం నల్ల తిమ్మాయపల్లె ప్రభుత్వ పాఠశాల, ఆకేపాడు ప్రభుత్వ పాఠశాల రాజంపేట ఉర్దూ పాఠశాల, మన్నూరు ప్రభుత్వ పాఠశాల, రాజంపేట బాలికల ఉన్నత పాఠశాల, షిరిడి సాయి పాఠశాల, బివియన్ పాఠశాలల నుంచి శాన్వి సంగ్రామం పోటీలకు హాజరైన క్రీడాకారులకు కోకో ,కబడ్డీ ,వాలీబాల్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు.

Related posts

రూ.2 వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

mamatha

నిషేధిత గుట్కా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఖమ్మం పోలీసులు

Satyam NEWS

Tuwj మేడ్చల్ జిల్లా ద్వితీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment