అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ అండ్ కాలేజీ (బాయ్స్) ప్రత్యేక సమావేశానికి ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ హాజరయ్యారు. పదవ తరగతి మరియు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కొరకు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చదువుల్లో క్రమశిక్షణ ఎంత అవసరమని క్రమశిక్షణ లేకపోతే బంగారు భవిష్యత్తుకు బాటలు ఉండవని, విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని,డ్రగ్స్ ని వారి దరి చేరనియ్యరాదని, ఒకసారి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడా నైపుణ్యాలు పెంచుకొని శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించుటకు అవిశ్రాంతముగా కృషి చేయాలని విద్యార్థుల్లో స్ఫూర్తి రగిలించారు.
జిల్లా ఎస్పీ వెంట మార్కాపురం డిఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, కంభం సిఐ మల్లికార్జున రావు, అర్ధవీడు ఎస్సై సుదర్శన్,కంభం ఎస్ఐ నరసింహారావు, బీవీ పేట ఎస్ఐ రవీంద్రబాబు, కాలేజీ ప్రిన్సిపాల్ బండి బాలరామిరెడ్డి మరియు సిబ్బంది ఉన్నారు.