39.2 C
Hyderabad
April 25, 2024 18: 56 PM
Slider చిత్తూరు

లక్ష్య సాధనతోనే విద్యార్థులకు సమాజంలో గౌరవం

#roja

విద్యార్థులు బాగా చదువుకుని ఒక లక్ష్యంతో కోరుకున్న విధంగా జీవితంలో సెటిల్ అవుతారో అప్పుడు ఆ కుటుంబంలో, సమాజంలో గౌరవం పొందే విధంగా అలాగే ఆర్థికంగా ఎదగడానికి అది ఉపయోగ పడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. నగరి నియోజకవర్గంలో 2022-23 సంవత్సరంలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలలో ఉన్నత పాఠశాల స్థాయిలో మెరిట్ ర్యాంక్ లు సాధించిన విద్యార్థులకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం సన్మానం చేసి పురస్కారాలు అందచేశారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో విద్యారంగానికి 60 వేల కోట్లు ఖర్చు పెట్టడమే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ర్యాంకులకు ప్రధాన కారణమని అన్నారు.

నేను నా పొలిటికల్ లైఫ్ లో…చాలా సార్లు…స్కూళ్లు, కాలేజీలు,యూనివర్సిటీలకు వివిద సమావేశాలకు వెళ్లాను, చాలా మంది విద్యార్థులకు….పురష్కారాలు, మెమొంటోలు అందించాను… కానీ ఏనాడూ పొందనంత గొప్ప అనుభూతి, ఆనందం నాకు ఈరోజు కలుగుతుందని అన్నారు. అసలు నేను…ఇలాంటి రోజంటూ ఒకటి వస్తుందని…అనుకోలేదని.. అదేంటంటే….ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఏంటి….టెన్త్ క్లాస్ లో టాప్ ర్యాంకులు రావడం ఏంటి…అని అందరూ ఆశ్చర్యపోతున్నారని, కానీ  ఈరోజు జగనన్న తీసుకొచ్చిన మార్పులు, సంస్కరణల వలన…అసాధ్యం అనుకున్నది…ఈరోజు సుసాధ్యం అయ్యింది…అని గర్వంగా చెప్పగలను అన్నారు.

నగరి నియోజకవర్గంలోనే కాదు….యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే…ఈసారి పదో తరగతి పరీక్షల్లో టాప్ ర్యాంకులు, టాప్ మార్కులు….ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు రావడం….మాకు, ఈ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకే కాదు…ఈ రాష్ట్రంలో ప్రతీ పేద విద్యార్థి తల్లిదండ్రులకు కూడా గర్వకారణంగా పేర్కొన్నారు. మట్టిలో మాణిక్యాలు….పేదింటి విద్యా దీపాలు..బంగారు భావితరాలు…సరస్వతీ బిడ్డలు….అయిన…వీరంతా…నిజంగానే జగనన్న…తీర్చిదిద్దిన ఆణిముత్యాలు అని ప్రశంసించారు.

ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిఏ లక్ష్యం కోసమైతే గత నాలుగేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారో….ఆ లక్ష్యం సాధించే దిశలో తొలి అడుగు…ఈరోజు టెన్త్ పరీక్షా ఫలితాలతో పడిందని నేను భావిస్తున్నానని తెలిపారు. ఇందులో విద్యార్థుల కృషి ఎంతుందో…..వారిని తీర్చిదిద్ది…జగనన్న ఆకాంక్షలకు అనుగుణంగా…పిల్లలను సాన బట్టిన ఉపాధ్యాయుల కృషి కూడా అంతే ఉందని అన్నారు. అందుకే…ఇదే స్ఫూర్తి…ప్రతీ ఏటా మన నగరి నియోజకవర్గంలో కొనసాగాలని…నా వంతుగా విద్యార్థులను ఈ రకంగా ప్రోత్సహిస్తున్నానని చెప్పారు.

వచ్చే ఏడాది మన నగరి విద్యార్థులు…ఈ రాష్ట్రంలో నే టాప్ ర్యాంకర్లుగా రావాలని కోరుతున్నాను అని ఆశాభావం వ్యక్తం చేశారు. మీరంతా…టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు వచ్చాయని సరిపెట్టుకోవద్దని,ఇంకా గొప్ప గొప్ప చదువులు చదివి, మంచి ఉద్యోగాలు పొంది, మీ కుటుంబాల్లో ఉన్న పేదరికాన్ని రూపుమాపాలని కోరారు. అలా జరిగిన రోజే…నిజంగా జగనన్న ఆశయం నెరవేరినట్టవుతుందని చెప్పారు. ప్రతీ పేదింట్లో విద్యా దీపం వెలిగించి, ఆ కుటుంబం చీకట్లు పారద్రోలాలన్న లక్ష్యంతోనే జగనన్న విద్యారంగంపై ఇంత శ్రద్ధ పెట్టారని అన్నారు.

 ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా పేదల కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారని చెప్పడానికి  ఈ పథకాలే నిదర్శనమని, కేజీ విద్య నుండి పీజీ విద్య వరకు ప్రతీ విద్యార్థిని సొంత మేనమామలో చదివించే బాధ్యతను తీసుకున్నారు మన జగనన్న అన్నారు. కార్పొరేట్ విద్య ను కామన్ మ్యాన్ కాళ్ల దగ్గరకు తీసుకొచ్చిన చరిత్రకారుడిగా ఈరోజు జగనన్న నిలిచిపోతారని పేర్కొన్నారు. కేవలం పేద పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశ్యంతో…జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద, జగనన్న సంపూర్ణ పోషణ, నాడు నేడు ఇంగ్లీష్ మీడియం విద్య వంటి ఇన్ని పథకాలు….ఈ దేశంలో ఏ సీఎం కూడా పేద విద్యార్థుల కోసం తీసుకురాలేదని వివరించారు.

పాదయాత్రలో….పేదల కష్టాలను చూసిన జగనన్న ఈ రోజు ఆ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించేలా గత నాలుగేళ్లుగా పరిపాలిస్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది కూడా ఇంతకంటే మంచి ఫలితాలు మన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకురావాలని ఉపాధ్యాయులు, విద్యార్థులను కోరుతున్నానని అన్నారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అహుతులను అలరించాయి.

ఈ సమావేశం లో చిత్తూరు ఎస్.పి.రిషాంత్ రెడ్డి, చిత్తూరు డిఇఓ విజయేంద్ర రావు, తిరుపతి డిఇఓ శేఖర్, డిప్యూటీ డిఇఓ రఘు రామయ్య, ఆర్డీఓ సుజన, నగరి నియోజకవర్గంలోని మునిసిపల్ చైర్మన్లు, ఎంపీపీ లు, వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీ లు, కౌన్సిల్లర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రాష్ట్ర డైరెక్టర్ లు, కమిటీల చైర్మన్లు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మండల విద్యా శాఖాధికారులు, తహసీల్దార్లు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

హ్యాట్సాఫ్ సునీల్: దివ్యాంగుడివైనా నీవే దేవుడితో సమానం

Satyam NEWS

తేజ సజ్జ ‘అద్భుతం’ పేరేంటి ఊరేంటి లిరికల్ సాంగ్ విడుదల..

Satyam NEWS

బాసర అమ్మవారి సేవలో ముస్లిం భక్తులు…..

Satyam NEWS

Leave a Comment