28.7 C
Hyderabad
April 25, 2024 05: 25 AM
Slider నల్గొండ

చదువుతో పాటు సామాజిక సృజనాత్మకత,కళలు విద్యార్థులకు అవసరం

#mlasaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో స్థానిక గ్రంథాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో శనివారం బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి బహుమతి ప్రదానం చేశారు.

‘తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు’ మీద నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్న ప్రతి చిన్నారిని భుజం తట్టి ప్రోత్సహించారు శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి.ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు ఇలాంటి సృజనాత్మక శక్తి  కలిగిన కళలు భవిష్యత్తులో పిల్లలను నాయకులుగా,మంచి పౌరులుగా తీర్చి దిద్దడానికి ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో చింతలపాలెం జడ్పిటిసి చింతరెడ్డి చంద్రకళ సైదిరెడ్డి, చింతలపాలెం మండల పార్టీ అధ్యక్షుడు మధిర సత్యనారాయణ రెడ్డి,ఎంపీపీ కొత్తమద్ది వెంకట రెడ్డి,వైస్ ఎంపీపీ పోలనేడి శ్రీనివాస్ రెడ్డి,సర్పంచ్ పద్మ వెంకట రెడ్డి,వైస్ సర్పంచ్ నరసింహారావు,గ్రామ శాఖ అధ్యక్షుడు పోతంశెట్టి శ్రీనివాస్,ఎన్ సి సి బి చైర్మన్ రంగాచారి,పిఎసిఎస్ కోటిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

తెలుగుదేశం పూర్వవైభవానికి కృషి చేయాలి: నీరుకొండ

Satyam NEWS

ఏపిలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

Satyam NEWS

‘‘అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ రైతు చట్టాలను ప్రతిపాదించింది’’

Satyam NEWS

Leave a Comment