28.2 C
Hyderabad
April 20, 2024 12: 33 PM
Slider రంగారెడ్డి

విద్యార్ధులు సామాజిక సేవలో ఎక్కువగా పాల్గొనాలి

#cbit

కోకాపేట లో హరే కృష్ణ హెరిటేజ్ టవర్  శంకుస్థాపన సందర్భంగా వాలంటీర్‌ లుగా పనిచేసిన సీబీఐటి కాలేజి విద్యార్ధులకు హరే కృష్ణ మొవెమెంట్ ప్రతినిధి రాకేష్ కుమార్ మిశ్ర నేడు ప్రశంసాపత్రాలు అందచేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు హరే కృష్ణ హెరిటేజ్ టవర్ కు  శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీబీఐటికి చెందిన ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు అయిన ఎమ్ సీ ఏ, ఎం బిఏ విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్ సిఎ విభాగ అధ్యాపకులు డాక్టర్ బి ఇందిరా  మాట్లాడుతూ  ప్రతి విద్యార్థి సామాజిక సేవ లో పాల్గొనాలని చెప్పారు.

కళాశాల పిఆర్ఓ డాక్టర్ జియెన్ఆర్ ప్రసాద్  మాట్లాడుతూ సుమారు 200 మంది విద్యార్థులు హరే కృష్ణ హెరిటేజ్ టవర్  శంకుస్థాపన లో వాలంటీర్‌గా పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న తరువాత విద్యార్థులో ఎంతో మార్పు గమనించామని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతున్నారని మరియు చదువు పట్ల అంకితభావం పెంచుకొన్నారు అని అన్నారు. రాకేష్ కుమార్ మిశ్ర మాట్లాడుతూ సామాజిక సేవ  కార్యక్రమాలలో పాల్గొనడం మన బాధ్యతలను  మెరుగుపరుచుకోవచ్చు అని అన్నారు. ఇతర అధ్యాపకులు డాక్టర్ ఎమ్ రాంచందర్, శ్రీనివాస్, పొన్నాల రమేష్ , కృష్ణ ప్రసాద్ , ఎమ్సిఎ రెండవ సెమిస్టర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భవేష్ మహేశ్వర్, కుమారి నిహారిక సమన్వయ కర్తగా వివరించారు అని తెలిపారు.

Related posts

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే

Satyam NEWS

సోమశిల అర్బన్ ఫారెస్టు పార్క్ పనులు మరింత వేగవంతం

Satyam NEWS

ఆరు గంటల ఆందోళన: రేపు కామారెడ్డి బంద్ కు రైతుల పిలుపు

Satyam NEWS

Leave a Comment