35.2 C
Hyderabad
April 20, 2024 16: 44 PM
Slider విజయనగరం

మళ్లీ రణరంగమైన విజయనగరం కలెక్టరేట్

#telugudesham

విజయనగరం కలెక్టరేట్ మరోసారి రణరంగమైంది. ఎస్ఎఫ్ఐ విద్యార్ధులు ఆందోళన తీవ్ర ఉద్రిక్త పరిస్థితి లకు దారి తీసింది. ఎస్ఎఫ్ఐ ధర్నా లో విద్యార్థినిలు కూడా పాల్గొనడంతో… వారిని కట్టడి చేసేందుకు మహిళా పోలీసులు రంగంలో కి దిగారు. దీంతో ఇరువురికి కాస్త ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కలెక్టరేట్ లో చొచ్చుకెళ్లేందుకు విద్యార్ధినీలు యత్నించగా..మహిళా పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా  అక్కడ నుంచీ ఈడ్చుకెళ్లిన జీపు లోకి ఎక్కించారు.ఎట్టకేలకు దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగిన ఆందోళనలు… ఖాకీల కట్టడితో చల్లారింది.

కోట వద్ద విద్యార్ధి ,యువజన సంఘాలు ధర్న

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అలాగే ఉద్యోగ విరమణ వయస్సు తగ్గించాలని విద్యార్ధి ,యువజన సంఘం నగరంలో ని కోట వద్ద నిరసన ప్రదర్శన కు దిగింది. ఈ సందర్భంగా కోట వద్దే సంఘం అంతా మానవహిరంలా ఏర్పడి కాసేపు ఆందోళన చేపట్టారు. అనంతరం యువజన నేతలు మీడియా తో మాట్లాడారు. తాను అధికారంలోకి రాగానే దశల వారీగా ఉద్యోగాల భర్తీ చేపడతానని ఇచ్చిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగిల భర్తీ సంగతి దేవుడెరుగు.. ప్రస్తుతం ఉద్యోగ విరమణ కాలం పెంచడం ఏ మాత్రం ఏ ఒక్కరికీ ఇష్టం లేదన్నారు. తక్షణమే ఆ చర్య వెనక్కు తీసుకోవాలని ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్ధి ,యువజన సంఘాలు డిమాండ్ చేసాయి.

Related posts

సిఫార్సులకు తావులేకుండా పోలీసు శాఖలో బదిలీలు…..!

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికుల్ని సన్మానించిన బీజేపీ నేత

Satyam NEWS

బెదిరింపుల నేపథ్యంలో కారుకు బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment