30.7 C
Hyderabad
April 19, 2024 07: 03 AM
Slider మహబూబ్ నగర్

పెట్రోల్ దాడులు చేస్తున్నా ఆగని అవినీతి

ACB raid

పెట్రోల్ దాడులు జరుగుతున్నా అవినీతి అధికారులు మాత్రం తమ పంథా మార్చుకోవడం లేదు. ప్రాణాలకన్నా అవినీతే ముఖ్యమనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటూ కూడా అవినీతికి పాల్పడుతున్న ఇలాంటి అధికారులను ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొని ఉంది. తాజాగా నారాయణపేట జిల్లా మక్తల్ సబ్ రిజిస్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. హైదరాబాద్ ఎల్ బి నగర్ కు చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యకి మక్తల్ సమీపంలోని సంఘం బండ  వద్ద 18 ఎకరాల  భూమి కొన్నాడు. ఇదే భూమిని అన్నదమ్ములకు ఇద్దరి పేరిట సగం, సగం భూమి రిజిస్టేషన్   చేయమని అడగగా దానికి మక్తల్ సబ్ రిజిష్టర్ హాబీబ్ ఉద్దీన్ 75 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో వెంకట్ రెడ్డి ఏసీబీ ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ పథకం ప్రకారం సబ్ రిజిస్టర్ లో కార్యాలయంలో   సబ్ రిజిస్టర్  హాబీబ్ ఉద్దీన్ కు వెంకట్ రెడ్డి 75000 వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. అతనితో పాటు అతనికి సహకరించిన ప్రయివేటు అటెండర్ ఆరిఫ్ ను కూడ అదుపులోకి తీసుకున్నారు.

Related posts

కన్నుమూసిన కర్షక్ ఇండస్ట్రీస్ అధినేత

Satyam NEWS

ఉపాధి హామీ లో రెండు పూటల పని రద్దుచేయాలి

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

Satyam NEWS

Leave a Comment