దళారులు ఇబ్బంది పెడుతున్నారని సుబాబుల్ రైతులు ఆందోళన చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల లో సుబాబల్ రైతులు ఈ మేరకు ఆందోళనకు దిగారు. రైతులు తీసుకొని వచ్చిన సుబాబుల్ కొనుగోలు చేయకుండా ట్రాన్స్ పోర్టు దళారులు చెప్పిన విధంగా సుబాబుల్ కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ట్రాన్స్ పోర్టర్లు తమ విధులను నిర్వర్తించకుండా దళారుల్లా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. వారు చెప్పినట్లే అక్కడ ఉన్న మార్కెట్ యార్డ్ అధికారులు సుబాబుల్ కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన పడుతున్నారు. రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్నా తమ ఉత్పత్తి మాత్రం కొనుగోలు చేయడం లేదని దళారులు ట్రాన్స్పోర్ట్ కంపెనీ నిర్వాహకులు కుమ్మక్కు అయ్యారని వారన్నారు. అసలు ధర ఒకటి రైతులకు ముట్టేది మరొకటి అని రైతులు అంటున్నారు.
previous post